Manchu Laxmi: ఆ సమయంలో మౌనికకు అండగా మంచు లక్ష్మి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా మంచు లక్ష్మికి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మంచు మనోజ్ (Manchu Manoj భార్య మౌనిక రెండు రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనివ్వగా మంచు లక్ష్మి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది మనోజ్ కు కూడా కెరీర్ పరంగా కలిసొస్తుండటం గమనార్హం. ఒకవైపు సినిమాలు మరోవైపు షోలతో మనోజ్ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. మౌనిక సైతం నాలుగు నెలల క్రితం బొమ్మల బిజినెస్ ను మొదలుపెట్టగా ఆ బిజినెస్ లో కూడా సక్సెస్ సాధించారు.

అయితే డెలివరీ సమయంలో మౌనికకు మంచు లక్ష్మి  (Manchu Lakshmi) అండగా ఉన్నారని మౌనికకు ధైర్యం చెబుతూ మంచు లక్ష్మి సపోర్ట్ చేశారని తెలుస్తోంది. పాపకు ఎం.ఎం.పులి అనే నిక్ నేమ్ పెట్టగా త్వరలో మరో పేరును ఫిక్స్ చేయనున్నారు. మంచు లక్ష్మి గ్రేట్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆడపడుచు అంటే మంచు లక్ష్మిలా ఉండాలంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మనోజ్ మౌనిక పెళ్లి మంచు లక్ష్మి చేతుల మీదుగా జరిగింది.

మరోసారి మేనత్త అయినందుకు మంచు లక్ష్మి ఆనందానికి అవధులు లేకుండా పోయాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మనోజ్ మౌనిక కెరీర్ పరంగా మరింత ఎదుగుతూ అన్యోన్యంగా ఉండాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. మనోజ్ మౌనిక రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. మనోజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి అప్ డేట్స్ రావాల్సి ఉంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్ ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తే కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మనోజ్ చాలామంది హీరోలతో పోల్చి చూస్తే పరిమితంగానే పారితోషికం అందుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus