Vishal: అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ముందువరసలో ఉంటారు. విలన్ పాత్ర చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా వరలక్ష్మీ శరత్ కుమార్ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. త్వరలో వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. వరలక్ష్మి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరలక్ష్మి మోస్ట్ వాంటెడ్ నటిగా మారిపోయారు.

వరలక్ష్మి వివాహ బంధంలోకి అడుగుపెట్టడం గురించి విశాల్ (Vishal) స్పందిస్తూ వరలక్ష్మి పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్లు చేశారు. వరలక్ష్మి సినిమాల్లో ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడిందని విశాల్ పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించి వరలక్ష్మి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంతో మంచి వ్యక్తి అని ఆమె తల్లిని కూడా నేను అమ్మ అని పిలుస్తానని విశాల్ అన్నారు.

వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు అని విశాల్ చెప్పుకొచ్చారు. గతంలో విశాల్, వరలక్ష్మి ప్రేమలో ఉన్నారని ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని విశాల్ పేర్కొన్నారు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల వల్ల వరలక్ష్మి, విశాల్ మధ్య దూరం పెరిగింది.

విశాల్ చేసిన కామెంట్ల గురించి వరలక్ష్మి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. వరలక్ష్మి పెళ్లి తర్వాత కూడా నటిగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ కు తమిళం కంటే తెలుగులోనే మంచి పేరు వచ్చింది. వరలక్ష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus