బుల్లితెరపై మంచి టీఆర్పీ రాబడుతోన్న జానకి కలగనలేదు సీరియల్లో రాశి, అమర్ దీప్ చౌదరి తల్లీ కొడుకులుగా నటించారు. జ్ఞానాంబ పాత్రలో రాశి, ఆమె కుమారుడిగా రామా అమర్ దీప్ నటించి మెప్పించారు. ఇక జానకిగా ప్రియాంక నటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమర్ దీప్ బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లడంతో తన కొడుకుకు ఓటేయమంటూ రాశి ఒక వీడియోను విడుదల చేసింది. ‘నేను మీ రాశిని.. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం నా కుమారుడు రామా (అమర్ దీప్ చౌదరి).
ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లో నా కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు మీరంతా బిగ్ బాస్ -7 చూస్తున్నారు. రామా చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. నా సపోర్ట్ కచ్చితంగా రామాకే. మీరంతా అమర్‌కి మద్దతుగా నిలిచి గెలిపిస్తారని కోరుతున్నాను. దయచేసి అమర్ దీప్ చౌదరికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది రాశి. ఈ వీడియో రిలీజ్ చేసిన క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ అమర్ దీప్‌కు సపోర్టుగా నటి రాశి (Actress) అలా వీడియో రిలీజ్ చేయడమే లేటు..మరుక్షణమే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ లైన్లోకి వచ్చారు. రాశిని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెట్టారు. అయితే రాశీపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు చెబితే మేం ఓటు వేయాలా? మా ఓటు రైతు బిడ్డకే’, ‘సీరియల్ బ్యాచ్ అందరూ గకలిసి గ్రూపిజం అడుతున్నారు మేడమ్.
అతనికి ఎందుకు ఓటేయాలి?, ‘ప్రతిసారి రైతు బిడ్డనే టార్గెట్ చేస్తున్నారు’, ‘అసలు అమర్‌కు సరిగా మాట్లాడడమే రాదు’, ‘దయచేసి అతనికి ఓటు వేయమని అడగకండి మేడం’ అని కామెంట్లు పెట్టారు రైతు బిడ్డ ఫ్యాన్స్. మీరు అసలు బిగ్ బాస్ షోను చూస్తున్నారా? గేమ్స్ ఆడడం లేదు, ఏవేవో మాట్లాడుతు్నాడు? అసలు అమర్‌కు ఎందుకు ఓటేయాలి మేడమ్’ అని కామెంట్స్ పెడుతున్నారు.