ఒక్కోసారి నటీనటుల డ్రెస్సింగ్ స్టైల్ అనేది చిత్ర విచిత్రంగా ఉంటుంది. అవి పర్సనల్ పిక్స్ అయినప్పటికీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే భయంకరమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. నటీనటుల విషయంలో ఇలాంటివి మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ విషయంలో ఎంతలా ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలుసు. ఇక బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటీనటుల విషయంలో కొంతవరకు ఓకే.
వాళ్ళు ప్రేక్షకుల దృష్టిని తమ వైపు తిప్పుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ దర్శక నిర్మాతలు ఇలాంటివి చేస్తే అది మరింత విడ్డూరంగా ఉంటుంది. అది వాళ్ళ సొంత ఇంట్లో అయితే పర్వాలేదు.. కానీ సినిమా ప్రమోషన్ విషయంలో ఇలా చేస్తే .. అది హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా దిల్ రాజు విషయంలో ఇదే జరిగింది.
విషయం ఏంటి అంటే.. రామ్ పెదనాన్న శ్రీ స్రవంతి మూవీస్ అధినేత అయిన ‘స్రవంతి’ రవికిశోర్ ‘దీపావళి’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆర్ ఏ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ కాబోతుంది. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కి తెలుగు వెర్షన్ ఇది. ఈ చిత్రాన్ని దిల్ రాజు కోసం స్పెషల్ షో వేశారు ‘స్రవంతి’ రవికిశోర్. ఈ సినిమా చూడటానికి దిల్ రాజు ప్రసాద్ ల్యాబ్స్ కి వచ్చారు.
అందులో తప్పేముంది అనుకుంటున్నారా…? దిల్ రాజు (Dil Raju) ఈ ప్రీమియర్ చూడటానికి షాట్ ధరించి వచ్చారు. దీంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ కి పెద్ద లాంటి వ్యక్తి దిల్ రాజు. ఆయన మాటల్లో ఆ హుందాతనం ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇలా ఓ సినిమా ప్రమోషన్ కోసం వచ్చేప్పుడు.. షాట్, టీ షర్ట్ లో… తన ఇంట్లో ఉంటున్నట్టు రావడం పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!