Ram Charan: చరణ్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ఇదే!

15 సంవత్సరాల సినీ కెరీర్ లో రామ్ చరణ్ ఇప్పటివరకు కేవలం 14 సినిమాలలో మాత్రమే నటించారు. చరణ్ 15వ సినిమాగా శంకర్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా సినిమా తెరకెక్కుతుండగా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఒక సెంటిమెంట్ చరణ్ అభిమానులను మాత్రం తెగ టెన్షన్ పెడుతోంది. చరణ్ ఒకే ఏడాది రెండు సినిమాలను విడుదల చేస్తే మొదట విడుదల చేసిన సినిమా హిట్టైనా తర్వాత విడుదల చేసిన సినిమా ఫ్లాపవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆచార్యతో చరణ్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2013 సంవత్సరంలో చరణ్ హీరోగా తెరకెక్కిన నాయక్, తుఫాన్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తుఫాన్ మూవీ మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. 2014 సంవత్సరంలో కొన్ని నెలల గ్యాప్ లో ఎవడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో ఎవడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే గోవిందుడు అందరివాడేలే సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఆచార్యతో చరణ్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్యలో చిరంజీవికి జోడీగా కాజల్ నటించగా చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. మణిశర్మ ఈ సినిమాకు అందించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్ తో ఆచార్య మూవీ తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

మరోవైపు రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. చరణ్ ఈ సినిమాతో ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయాల్సి ఉంది. ఆచార్యతో చరణ్ ఈ రెండు సెంటిమెంట్లను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus