యూ టర్న్ రీమేక్ కోసం కొత్త కాంబినేషన్

పెళ్ళికి ముందు ప్రేమపక్షులుగా, పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా అందరికీ లైఫ్ గోల్స్ ఇస్తున్న సమంత-నాగచైతన్య త్వరలోనే మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. పెళ్లి తర్వాత సమంత సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే.. రెండేళ్ల క్రితం కమిట్ అయిన కన్నడ చిత్రం “యు టర్న్” రీమేక్ మాత్రం చేసితీరాలని నిశ్చయించుకొంది సమంత. కన్నడ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగులోనూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

అయితే.. ఈ చిత్రంతో సమంత నిర్మాతగా మారనుందని తెలుస్తోంది. స్వయంగా ఓ బ్యానర్ ను కూడా ప్రారంభించి “యు టర్న్” చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే.. హీరోయిన్ గా చేస్తూ రెండు భాషల ప్రొడక్షన్ ను చూసుకోవడం కష్టం కాబట్టి.. ప్రొడక్షన్ ను నాగచైతన్య చేతిలో పెట్టనుందట. సో “యు టర్న్” రీమేక్ తో నాగచైతన్య-సమంత సరికొత్త టర్న్ తీసుకోనున్నారన్నమాట. మరి ప్రొడ్యూసర్ & హీరోయిన్ గా చైతూసమంతలు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus