Bigg Boss 7 Telugu: హౌస్ లోకి వచ్చిన కొత్తవాళ్లతో ఆడే గేమ్ ఏంటో తెలుసా? టార్గెట్ ఎవరంటే.?

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు. ముందుగా అందరూ ఊహించినట్లుగానే అక్టోబర్ 8వ తేదిన 2.ఓ అంటూ గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో సెలబ్రిటీలు హంగామా చేశారు. చిన్నా సినిమా ప్రమోషన్స్ కోసం సిద్దార్ధ్ , అలాగే టైగర్ నాగేశ్వర్రావ్ సినిమాకోసం మాస్ మహారాజా రవితేజ ఇద్దరూ వచ్చి హౌస్ మేట్స్ తో ఫన్ చేశారు. సిద్దార్ధ్ అయితే హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ ని పలకరిస్తూ సందడి చేసి, వారితో డ్యాన్స్ కూడా చేశాడు. తన పాటలని ఇంగ్లీష్ లో పాడుతూ వాటిని గెస్ చేయమని గేమ్ ని కూడా ఆడించాడు. అయితే, సండే ఎపిసోడ్ చాలా అనూహ్యమైన మార్పులతో జరిగింది. ఫస్ట్ రౌండ్ లోనే హౌస్ మేట్స్ ఎలిమినేషన్ తో స్టార్ట్ అయ్యింది. శుభశ్రీని ఎలిమినేట్ చేస్తూ ఎపిసోడ్ చాలా ఉత్కంఠంగా స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. శుభశ్రీ స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ ని పలకరించింది. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్లిపోయింది.

ఆ తర్వాత అనూహ్యంగా నాగార్జున మిగిలిన కంటెస్టెంట్స్ లో కూడా ఎలిమినేషన్ ప్రోసెస్ మొదలు పెట్టారు. చివరగా మిగిలిన తేజ ఇంకా గౌతమ్ మద్యలో డెసీషన్ హౌస్ మేట్స్ మీదకి వదిలేశారు. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని వాళ్లని తక్షణమే ఎలిమినేట్ చేసేయమని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ గౌతమ్ కి ఓటు వేశారు. ఉన్న 7 గురు హౌస్ మేట్స్ లో 6 ఓట్లు గౌతమ్ కి పడ్డాయి. దీంతో గౌతమ్ ని ఎలిమినేట్ చేశాడు హోస్ట్ నాగార్జున. స్టేజ్ పైకి వచ్చిన గౌతమ్ హౌస్మేట్స్ ని పకరిస్తూ అందరికీ అడ్వైజ్ ఇచ్చాడు. చివరగా గౌతమ్ వెళ్లిపోతుంటే నాగార్జున తిరిగి పిలిచి ఇది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి, సీక్రెట్ రూమ్ లోకి పంపించాడు. దీంతో సీక్రెట్ రూమ్ లో గౌతమ్ తర్వాత ఏం జరగబోతోందనేది ఆసక్తిగా చూడసాగాడు. ఇక గ్రాండ్ లాంఛింగ్ లో భాగంగా ఒక్కొక్క హౌస్ మేట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ముందుగా సీరియల్ ఆర్టిస్ట్ అర్జున్ అంబటి వచ్చాడు. ఇప్పటివరకూ తను బిగ్ బాస్ ఫాలో అయ్యానని యావర్ ఇంకా పల్లవి ప్రశాంత్ లు చాలా బాగా ఆడుతున్నారని దమ్ము చూపిస్తున్నారని, సందీప్ ఇంకా అమర్ లు దుమ్ములేపుతూ సరిగ్గా ఆడట్లేదని చెప్పాడు. అంతేకాదు, అమర్ ఎందుకు అలాంటి గేమ్ ఆడుతున్నాడో అర్ధం కావట్లేదని చెప్పాడు. దీంతో అర్జున్ అంబటి హౌస్ లోకి వెళ్లి ఏదో ఒకటి చేసేలాగానే కనిపిస్తున్నాడు.

తర్వాత కంటెస్టెంట్ గా మోడల్, ఆర్టిస్ట్ అశ్వినీ వచ్చింది. అశ్వినీ కూడా బిగ్ బాస్ ఫాలో అవుతున్నానని అమ్మాయిుల్లో శోభా, ప్రియాంక గేమ్ సరిగ్గా ఆడట్లేదని చెప్పింది. అంతేకాదు, తను కిక్ బాక్సర్ అని ఫిజికల్ టాస్క్ వస్తే ఇచ్చిపారేస్తనంటూ చెప్పుకొచ్చింది. దీంతో అశ్విని పై అంచనాలు బాగా పెరిగిపోయాయి.

తర్వాత మూడో కంటెస్టెంట్ గా భోళే షావాలి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన పాటలతో అందరినీ మైమరిపించేలా చేస్తూ యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన భోళే షావాలి ఒక డప్పుతీసుకుని స్టేజ్ పైకి వచ్చాడు. నాగార్జున గారికి అంకితం ఇస్తూ ఒక పాట పాడి ఇంప్రెస్ చేశాడు. దీంతో నాగార్జున ఆ డప్పుతోనే భోళేని హౌస్ లోకి పంపాడు.

తర్వాత కంటెస్టెంట్ గా గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ అయిన పూజామూర్తి వచ్చింది. రీసంట్ గా తన నాన్నగారు చనిపోవడం వల్లే బిగ్ బాస్ కి రాలేకపోయానని చెప్పింది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెతడానని అనేలోగా నాన్న చనిపోవడం అనేది కోలుకోలేని దెబ్బ అని చెప్పింది. ఇక నాగార్జున పూజాకి వెల్కమ్ చెప్తూ వాళ్ల నాన్నగారు అత్యంత ఇష్టంగా చేసే పొదీనా చెట్నీని ఇచ్చి హౌస్ లోకి పంపారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో సందీప్, శివాజీ ఇద్దరి గేమ్ చాలా బాగుందని చెప్పింది పూజామూర్తి.

తర్వాత కంటెస్టెంట్ గా నయనీ పావని వచ్చి దుమ్మురేపింది. చాలా యాక్టివ్ గా కనిపించిన ఈ అమ్మడు ప్రిన్స్ తో డేట్ చేస్తానని, తేజని ప్రెండ్షిప్ చేస్తానని, పల్లవి ప్రశాంత్ ని పెళ్లి చేసుకుంటానంటూ ఫన్నీ గా ఆన్సర్స్ చెప్పింది.అంతేకాదు, కొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉన్న అమ్మాయిలాగానే కనిపించింది. మరి హౌస్ లో ఏం చెస్తుందనేది చూడాలి. ఇలా ఐదుగురుని హౌస్ లోకి పంపిన కింగ్ నాగార్జున వాళ్లకి కొన్ని బాధ్యతలు అప్పజెప్పాడు. అర్జున్, అశ్విని ఇద్దరినీ హౌస్ మేట్స్ లగేజ్ కి హెడ్స్ గా నియమించాడు. అలాగే, పూజా, భోళే, నయనీలని బెడ్ రూమ్స్ కి హెడ్ గా నిర్ణయించాడు. దీంతో వాళ్లు ఏ లగేజ్ ఇస్తే దాన్నే హౌస్ మేట్స్ వాడాలి. అలాగే వాళ్లు ఏ బెడ్ కేటాయిస్తే వాళ్లు దానిపైనే పడుకోవాలి. చివరగా అందరికీ సెండ్ హాఫ్ ఇస్తూ గ్రాండ్ గా రవితేజని తీస్కుని వచ్చి వాళ్లలో జోష్ నింపాడు. 2.ఓ ద్వారా కొత్తగా వచ్చిన హౌస్ మేట్స్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరం.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus