సంక్రాంతి పండుగకు ఈ హీరోల మధ్య పోటీ ఉండనుందా?

  • July 29, 2022 / 05:19 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇతర పండుగలతో పోల్చి చూస్తే సంక్రాంతి సీజన్ కీలకం అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పలు పెద్ద సినిమాలు విడుదల కావాల్సి ఉండగా కరోనా థర్డ్ వేవ్ వల్ల భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాలలో బంగార్రాజు సినిమా హిట్ గా నిలిచింది. 2023 సంక్రాంతికి ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల కానున్నాయి.

చరణ్ శంకర్ కాంబో మూవీ, మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ, ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ, పవన్ క్రిష్ కాంబో మూవీ 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఛాన్స్ లేదు. ఇప్పటికే ఈ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కావని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాల స్థానంలో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ, ఏజెంట్ మూవీ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సాధారణంగా పెద్ద పండుగల సమయంలో మూడు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.

అయితే ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఈ సినిమాలను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే అధికారికంగా ఏజెంట్, బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ రిలీజ్ డేట్లను ప్రకటించాల్సి ఉంది. బాలయ్య 107 సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

మరోవైపు సీనియర్ స్టార్ హీరోలు ఇతర భాషలపై దృష్టి పెట్టాలని పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఈ హీరోలు ప్రయత్నించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2023 సంక్రాంతికి టాలీవుడ్ స్టార్స్ మధ్య గట్టి పోటీ ఉండనుందని తెలుస్తోంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus