Allu Arjun: అన్నపూర్ణలో అల్లు అర్జున్ ఫొటోషూట్..!

‘పుష్ప’.. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. హీరోగా బన్నీ ఇంతకుముందెన్నడూ కనినించని ఊరమాస్ గెటప్ లో కనిపించాడు. తెలుగుతో పాటు మలయాళంలోనూ బన్నీకి మార్కెట్ ఉంది.. సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు కానీ.. ఎవరూ ఊహించని విధంగా.. అదీ పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతుందని ఎవరూ ఊహించలేదు..

దేశవ్యాప్తంగా ‘పుష్ప’ రాజ్ క్రేజ్ కి అంతా ఫిదా అయిపోయారు.. ‘తగ్గేదే లే’ అంటూ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. 2021లో ఇండియాలోనే హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా ‘పుష్ప’ రికార్డ్ క్రియేట్ చేసింది. ‘పుష్ప ‌- ది రైజ్’ తర్వాత ‘పుష్ప – ది రూల్’ కోసం బన్నీ ఫ్యాన్స్, మూవీ లవర్స్ అండ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గతకొంత కాలంగా తన టీంతో కలిసి స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్న సుకుమార్ రీసెంట్ గా బన్నీ లుక్ టెస్ట్ చేశారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ‘పుష్ప’ పార్ట్ 2కి సంబంధించి బన్నీ ఫొటోషూట్ చేశారు. పార్ట్ 1లో కనిపించిన దానికింటే కాస్త డిఫరెంట్ గా, సరికొత్తగా బన్నీ లుక్ ఉండబోతుందని, ఈ లుక్ టెస్ట్ ఔట్ పుట్ తో టీం శాటిస్ఫై అయ్యారని తెలుస్తోంది. త్వరలో ‘పుష్ప 2’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. రష్మిక మందన్న, సునీల్, అనసూయ భరద్వాజ్ లతో పాటు భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ తో తెలుగు ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసిన టాలెంటెడ్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కూడా పార్ట్ 2లో కనిపించనున్నారు.

ముఖ్యంగా ఫాహద్, బన్నీల మధ్య ఈగోకి సంబంధించిన వార్ ఎలా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ అందిరిలోనూ ఉంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పార్ట్ 1కి ఇచ్చిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి.. పార్ట్ 2కి దానికి మించిన రేంజ్ లో మ్యూజిక్ కంపోజ్ చెయ్యబోతున్నారని టాక్..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus