స్టార్‌ హీరోపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్!

  • January 11, 2022 / 10:58 AM IST

ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ లైంగిక వేధింపుల కేసులో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. కేరళ పోలీసుల క్రైమ్ బ్రాండ్ దిలీప్ తో పాటు మరో ఐదుగురిపై కొత్త కేసు నమోదు చేసింది. అందుతున్న సమాచారం ప్రకారం.. దిలీప్ తో పాటు మరో ఐదుగురు కలిసి విచారణ జరుపుతున్న అధికారులను బెదిరించారట. ఈ విషయాన్ని దర్శకుడు బాలచంద్రకుమార్ వెల్లడించారు. ఇటీవల దర్శకుడు బాలచంద్ర కుమార్ 2017 నటిపై దాడి కేసులో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.

కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను దిలీప్, ఆయన బృందం బెదిరించినట్లు ఆడియో క్లిప్‌ల ద్వారా బయటకొచ్చింది. దీంతో దిలీప్‌తో పాటు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ మొదటి నిందితుడు. ఆయన సోదరుడు అనూప్, బావమరిది వరుసగా రెండవ, మూడవ నిందితులుగా ఉన్నారు. దర్శకుడు బాలచంద్ర కుమార్ స్టేట్మెంట్ ప్రకారం దిలీప్ తో పాటు ఆ వ్యక్తులు దర్యాప్తు అధికారుల ప్రాణాలకు హాని కలిగించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

2017లో ఒక ప్రముఖ మలయాళ నటిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో దిలీప్ కుమార్ పేరు బయటకు రావడం సంచలనమైంది. ఐదేళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. ఈ కేసులో కొన్ని వారాల పాటు దిలీప్ కుమార్ జైల్లో కూడా ఉన్నారు. జనవరి 5న దిలీప్ కస్టడీని మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు చోటు చేసుకున్న కొత్త పరిణామాలతో దిలీప్ కుమార్ మరోసారి కస్టడీలోకి వెళ్తాడేమో చూడాలి!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus