డ్రగ్స్ కేసులో ఇరుకున్న దీపికా పదుకొనె..?

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపుతోంది. హీరోయిన్ రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి మరియు కొందరు డ్రగ్ పెడ్లర్స్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని విచారించగా పలువురు బాలీవుడ్ స్టార్స్ కి డ్రగ్స్ అలవాటు ఉందని బయటపడినట్లు సమాచారం అందుతుంది. బలమైన ఆధారాలు సేకరించిన అధికారులు కొందరు బాలీవుడ్ స్టార్స్ కి సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. వీరిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఉన్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.

దీపికా పదుకొనె డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం సేకరించిన అధికారులు ఆమెను విచారించనున్నారట. డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయని బయటపడిన తరుణంలో ఆమె అరెస్ట్ కూడా జరిగే అవకాశం కలదు. అలాగే శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ పేర్లు సైతం డ్రగ్ రాకెట్ వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా కంగనా రనౌత్ దీపికా పదుకొనెను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదంగా ఉంది. ‘రిపీట్ ఆఫ్టర్ మీ’ అనే మానసిక వ్యాధి డ్రగ్ బానిసలకు వస్తుంది.

ముంబైలో హై క్లాస్ సొసైటీకి చెందినవారిమి అని చెప్పుకొనే కొందరు తమ మేనేజర్స్ ని ‘మాల్ ఉందా?’ అని అడుగుతారు అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో యాష్ ట్యాగ్ తో దీపికా పేరును పొందుపరచడం విశేషం. గతంలో దీపిక రిపీట్ ఆఫ్టర్ మీ అనే రుగ్మతతో బాధపడ్డారని కంగనా గుర్తు చేశారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus