Talented Heroines: ఈ టాలెంటెడ్ హీరోయిన్లకు అన్నీఉన్నా అదృష్టం లేదా?

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావాలంటే గ్లామరస్ గా కనిపించడానికి సిద్ధంగా ఉండాలి. కొంతమంది హీరోయిన్లు అభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే చెబుతున్నా మెజారిటీ హీరోయిన్లు అందాల ఆరబోతకు సిద్ధంగా ఉన్నారు. అయితే అందాలను ఆరబోస్తున్నా కొంతమంది హీరోయిన్లకు మాత్రం అదృష్టం తలుపు తట్టడం లేదు. ఆఫర్లు వస్తున్నా ఈ హీరోయిన్లకు ఆశించిన విజయాలు దక్కడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కుమారి21ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన హెబ్బా పటేల్ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించినా ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకునే విషయంలో ఫెయిలయ్యారు.

హెబ్బా పటేల్ కు తర్వాత రోజుల్లో తొలి సినిమా స్థాయి సక్సెస్ అయితే దక్కలేదనే చెప్పాలి. రాబోయే రోజుల్లో అయినా ఈ బ్యూటీ జాతకం మారి విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హీరోయిన్ డింపుల్ హయాతి తెలుగమ్మాయి అయినా స్కిన్ షో విషయంలో ఈ బ్యూటీ అస్సలు వెనుకడుగు వేయదు. ఖిలాడి మూవీలో డింపుల్ హయాతి స్కిన్ షో విషయంలో అస్సలు తగ్గలేదు. అయితే ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు.

డింపుల్ హయాతికి రాబోయే రోజుల్లో అయినా లక్ కలిసొస్తుందేమో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో విజయాలు ఉన్నా ఈ హీరోయిన్ కు కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అందం ఉన్నా ఈ బ్యూటీకి కూడా లక్ కలిసిరావడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.

రాబోయే రోజుల్లో ఈ హీరోయిన్లకు (Heroines) వరుసగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని ఆయా హీరోయిన్ల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి కొందరు హీరోయిన్లు సైతం అందాలను ప్రదర్శిస్తున్నా ఆయా హీరోయిన్లకు కెరీర్ పరంగా మేలు జరగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus