అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో 4వ సినిమాగా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) వచ్చింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమార్ రూ.1830 కోట్లు పైగా కలెక్ట్ చేసి ‘బాహుబలి 2’ రికార్డుని బ్రేక్ చేసినట్టు నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికీ నార్త్ లో ‘పుష్ప 2’ మంచి వసూళ్లు సాధిస్తుంది. తెలుగులో రన్ దాదాపు ముగిసినట్టే.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా సంక్రాంతి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj), వెంకటేష్(Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi)..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) వంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలా వరకు ప్రేక్షకులు ‘పుష్ప 2’ ని మర్చిపోయారు. ‘పుష్ప 2’ ని థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి టైంలో నిర్మాతలు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే ‘పుష్ప 2’ చిత్రం రీలోడెడ్ వెర్షన్ అంటూ ఎక్స్ట్రా ఫుటేజీ యాడ్ చేస్తున్నారట. జనవరి 11 నుండి థియేటర్లలో ఆ 20 నిమిషాల ఫుటేజీని చూడొచ్చన్న మాట. అయితే ఈ టైంలో ఆ ఫుటేజీ కోసం జనాలు థియేటర్లకు వెళ్తారు. పైగా ‘పుష్ప 2’ రన్ టైం ఇప్పటికే 3 గంటల 20 నిమిషాలు ఉంది.
దానికి ఇంకో 20 నిమిషాలు అంటే 3 గంటల 40 నిమిషాల పాటు థియేటర్లలో ఉండాలి. మిగిలిన యాడ్స్ వంటివి వాటితో కలుపుకుంటే.. 4 గంటల పాటు ప్రేక్షకులు థియేటర్లలో గడపాలి. పండుగ రోజుల్లో అంత టైం జనాలు పాత సినిమాల కోసం కేటాయించడం కష్టం. ఓటీటీలో వచ్చినప్పటికీ అంతసేపు స్పెండ్ చేస్తారని చెప్పలేం. మరి ఇప్పుడు నిర్మాతలు ప్రేక్షకుల నుండి ఇంకేం ఆశిస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి.