Kantara: మరో ‘వరాహ రూపం’ వచ్చేసింది… తొలి పాటకు దక్కిన ఆదరణ వస్తుందా?

‘కాంతార’ సినిమాలో ‘వరాహ రూపం..’ పాట చాలా కీలకం. సినిమాలో ఎంత కీలకమో, సినిమా ప్రజల నోళ్లలో నానడానికి కూడా అంతే కీలకం. మీకు గుర్తుంటే ఈ పాట రాగానే ఇన్‌స్టంట్‌ హిట్‌ అయిపోయింది. డివోషనల్‌ సాంగ్‌ కావడం, వింటుంటే గూస్‌ బంప్స్‌ ఫీలింగ్‌ రావడం లాంటివి ‘కాంతార’ సినిమా సమయంలో జరిగాయి. అలాగే ఈ సినిమా ప్రచారం కోసం కూడా పాట ఉపయోగపడింది. ఆ సాంగ్‌ ట్యూన్‌ విషయంలో ఫిర్యాదులు, పాటను యూట్యూబ్‌ నుండి తొలగించడం లాంటివి అప్పట్లో సినిమా పేరు ప్రజల నోళ్లలో నానడానికి ఒక కారణమైంది.

Kantara

ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా? అలాంటి ఓ డివోషనల్‌ సాంగ్‌ని ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమా టీమ్‌ రిలీజ్‌ చేసింది. ‘కాంతార’ సినిమా అనగానే కర్ణాటక గ్రామీణ ప్రాంత సంస్కృతి, వారి సంప్రదాయం, అడవి తల్లి జానపదం గుర్తొస్తాయి. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్‌ 1’లో కూడా అదే టచ్‌లో ఉన్న ‘బ్రహ్మ కలశ..’ అనే డివోషనల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ‘వరాహ రూపం..’ పాటను మించిపోయేలా ఈ పాటను తీర్చిదిద్దారు. శివునిపై భక్తి ప్రపత్తులు ఉట్టి పడేలా ఉన్న లిరిక్స్ రాసుకొచ్చారు.

కృష్ణకాంత్ లిరిక్స్ రాసిన ఈ పాటను అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు. ‘వరాహ రూపం..’ పాట థీమ్‌తోనే ఈ పాటను కూడా ప్రారంభించడం గమనార్హం. దీంతో ఈ పాట కూడా ఇన్‌స్టంట్‌ హిట్‌ అయిపోయింది. ఇక ఈ సినిమాలో రాజు నుండి తమ వారిని కాపాడుకునేందుకు ఆ తెగ నాయకుడు ఏం చేశాడు అనేదే ప్రధాన కథగా చెప్పొచ్చు. ట్రైలర్ ఆఖరులో చేతిలో త్రిశూలంతో శివయ్యే దర్శనమిచ్చాడా అనేలా రిషభ్ శెట్టి లుక్‌ అదరగొట్టారు. తొలి సినిమాలాగే ఈ సినిమాను కూడా రిషభ్ ప్రధాన పాత్ర పోషిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాళీ భాషల్లో అక్టోబర్ 2న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus