మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ‘సలార్‌’ సినిమాతో ఇప్పటికే విలన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా.. ఇంకా ఆయన విలన్‌ అవ్వలేదు. ఎందుకంటే ఆయన ఆ సినిమాలో విలన్‌ అవ్వాలి అంటే రెండో పార్టు కూడా బయటకు రావాలి. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కాబట్టి ఇంకా ఆయన విలన్‌ అవ్వలేదు. మరోవైపు రాజమౌళి – మహేష్‌బాబు సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు అని వార్తలొస్తున్నా.. ఇంకా ఆ సినిమా కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌ కాలేదు. ఈ లెక్కన పృథ్వీరాజ్ సుకుమారన్ విలనీని నాని సినిమాతో చూసే అవకాశం ఉందని సమాచారం.

Prithviraj Sukumaran

‘ఓజీ’ సినిమా దర్శకుడు సుజీత్‌ తన తర్వాతి సినిమాను నాని హీరోగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే ఈ సినిమా అనౌన్స్‌ అయింది. ‘ఓజీ’ సినిమా నిర్మాత డీవీవీ దానయ్యనే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ‘బ్లడీ రోమియో’ అనే పేరును పరిశీలనలో ఉంది అని చెబుతున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులను కొన్ని రోజుల తర్వాత సుజీత్‌ ప్రారంభిస్తారట. ‘ఓజీ’ కోసం గత కొన్ని ఏళ్లుగా వరుసగా పని చేస్తున్న సుజీత్‌.. ఇప్పుడు రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లాలని ఫిక్స్‌ అయ్యారట.

తిరిగి సినిమాల్లోకి వచ్చిన వెంటనే ‘బ్లడీ రోమియో’ పనులు షురూ చేస్తారట. అయితే ఇప్పటివరకు జరిగిన చర్చల్లో భాగంగా ఈ సినిమాలో విలన్‌గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓకే అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారట. ఈ మేరకు కొంతమేర చర్చలు కూడా జరిగాయట. గతంలోనే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో సుజీత్‌కి పరిచయం ఉంది. పృథ్వీరాజ్‌ తీసిన ‘లూసిఫర్‌’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలనే ప్రతిపాదన సుజీత్‌ దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరూ కలిశారట. ఆ క్రమంలో ‘సాహో’ సినిమాను ఆయన బాగా మెచ్చుకున్నారట.

సినిమా టేకింగ్‌ విషయంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చాలా మాట్లాడారని.. పనితనం మెచ్చుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి కూడా. ఈ లెక్కన సుజీత్‌ ఓ పాత్ర రాసుకుంటే పృథ్వీరాజ్‌ కచ్చితంగా చేస్తారు అని చెప్పొచ్చు. మరి చేస్తారా లేదా చూడాలి. చేస్తే మాత్రం ఈ సినిమా రాజమౌళి – మహేష్‌ సినిమా కంటే ముందే రావొచ్చని టాక్‌.

ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus