రామ్ చరణ్ (Ram Charan) శంకర్ (Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) ఏ నిమిషాన మొదలుపెట్టారో కానీ ఊహించని ఆవాంతరాల వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ ఈ ఏడాది క్రిస్మస్ పండుగ కానుకగా విడుదల కానుందని క్లారిటీ వచ్చేసింది. ఆ సమయంలో ఈ సినిమా రిలీజ్ కావాలంటే డిసెంబర్ 20వ తేదీకి అటూఇటుగా సినిమాను విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే గేమ్ ఛేంజర్ సినిమాకు పోటీగా సితారే జమీన్ పర్ అనే బాలీవుడ్ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది.
అమీర్ ఖాన్ (Aamir Khan) హీరోగా ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ కు భారీ స్థాయిలో థియేటర్లు దొరకడం సులువైన విషయం కాదు. ఇండియన్2 (Bharateeyudu -2) సినిమాతో డైరెక్టర్ శంకర్ ప్రేక్షకులను నిరాశకు గురి చేశారు. గేమ్ ఛేంజర్ సినిమాకు మరో భారీ సినిమాతో పోటీ వల్ల ఇబ్బందేనని చెప్పవచ్చు. దిల్ రాజు బ్యానర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్ కావడం గమనార్హం.
దిల్ రాజు (Dil Raju) సొంత బ్యానర్ తో పాటు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం సంథింగ్ స్పెషల్ అనేలా ఉండనున్నాయని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ త్వరలో రానున్నాయని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.