Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 31, 2026 / 03:18 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుమంత్ (Hero)
  • నేహా పఠాన్ (Heroine)
  • జగపతి బాబు, త్రినాథ్ వర్మ, శ్రీనివాస్ అవసరాల,షెల్లీ ఎన్ కుమార్, రవివర్మ, గౌతమ్ పండిట్ తదితరులు (Cast)
  • రాజేష్ కర్ణ (Director)
  • హరీష్ కోహిర్కర్ (Producer)
  • సిన్జిత్ ఎర్రమిల్లి (Music)
  • వేద వ్యాస్ గొట్టిపాటి (Cinematography)
  • అనిల్ కుమార్ పి (Editor)
  • Release Date : 31st జూలై 2026
  • మార్క్ మై వర్డ్స్ ప్రొడక్షన్స్ (Banner)

‘సుమంత్ పని అయిపోయింది’ అనుకున్న ప్రతిసారి ఓ డీసెంట్ హిట్ ఇచ్చి ఆ కామెంట్స్ కి బ్రేక్ వేస్తుంటాడు. ‘మళ్ళీరావా’ తో సుమంత్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తర్వాత ‘సీతా రామం’సార్’ వంటి సినిమాల్లో అత్యంత కీలక పాత్రలు పోషించి క్రిటిక్స్ ను మెప్పించాడు. ‘అనగనగా’ తో ఓటీటీ మార్కెట్ కూడా ఏర్పరుచుకున్నాడు. అతను ప్రధాన పాత్రలో.. ఈటీవీ విన్ అసోసియేషన్ తో రూపొందిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘న్యూటన్స్ 3rd లా’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో సుమంత్ (Sumanth) ఎలాంటి మేజిక్ క్రియేట్ చేశాడో తెలుసుకుందాం రండి :

Newton’s 3rd Law Movie Review

Newton's 3rd Law Movie Review And Rating

కథ : సిక్కింలో ఉన్న జులుక్‌లో ఈ కథ మొదలవుతుంది. 2026లో (ప్రస్తుత టైమ్‌లైన్‌లో) డేవిడ్ అలియాస్ కిషోర్ (అవసరాల శ్రీనివాస్) ‘న్యూటన్స్ థర్డ్ లా పార్ట్ 1’ పుస్తకం చదువుతూ ఉంటాడు. అక్కడి నుంచి కథ వెంటనే 1999కి షిఫ్ట్ అవుతుంది.

అక్కడ తన భర్త చనిపోయిన వార్త తెలుసుకున్న జ్యోతి (Neha Pathan) తన కూతురు శ్రావ్యతో కలిసి తణుకు బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో జ్యోతికి యాక్సిడెంట్ అవుతుంది. తల్లి మరణించడంతో శ్రావ్య అనాథ అవుతుంది.

మరోవైపు వినయ్ (త్రినాథ్ వర్మ) ఫోన్ మాట్లాడేందుకు తన అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్తాడు. తర్వాత ఎవరూ ఊహించని విధంగా అతను అపార్ట్మెంట్ పై నుంచి కింద పడి మరణిస్తాడు. అతని మరణం వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టేందుకు రంగంలోకి దిగుతాడు పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (Sumanth).

ఈ క్రమంలో వాసుదేవ్‌కు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. వినయ్ పైనుంచి పడి ప్రమాదవశాత్తు మరణించలేదని, అతడి మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు తలలో ఒక బుల్లెట్ లభ్యమవుతుంది. దీంతో కేసు మరింత కాంప్లికేటెడ్‌గా మారుతుంది.

వినయ్, జ్యోతిల మరణాల వెనుక ఉన్నది ఎవరు? అసలు మెర్క్యూరీ (జగపతి బాబు)కి, వినయ్‌కి ఉన్న సంబంధం ఏంటి? వినయ్ చనిపోవడానికి ముందు కార్తీక్ (గౌతం పండిట్) అతడితో ఎందుకు గొడవపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

Newton's 3rd Law Movie Review And Rating

నటీనటుల పనితీరు: సుమంత్ సటిల్డ్ రోల్స్ చాలా బాగా చేస్తాడు. అతని బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర ఈ సినిమా ద్వారా అతనికి లభించింది. అందువల్ల వాసుదేవ్ పాత్ర సహజంగా అనిపిస్తుంది. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ కూడా వినయ్ పాత్రలో చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేశాడు. ఇతని ఫ్రెండ్ రోల్ చేసిన గౌతం పండిట్ కూడా బాగా చేశాడు.

రాబోయే రోజుల్లో ఇతను కూడా బిజీ ఆర్టిస్ట్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తల్లి పాత్రలో షెల్లీ ఎన్ కుమార్ కూడా బాగా చేసింది. తల్లి పాత్రలకి ఈమె కూడా ఓ మంచి ఆప్షన్ గా టాలీవుడ్ మేకర్స్ భావించే అవకాశాలు ఉన్నాయి. జగపతి బాబు పాత్ర విలన్ రోల్ కి తక్కువ కెమియోకి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ పాత్ర కూడా ఆల్మోస్ట్ అంతే. ఇక రవివర్మ, నేహా పఠాన్ కూడా పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అనిపించుకున్నారు.

Newton's 3rd Law Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: న్యూటన్స్ 3rd లా అంటే చాలా మందికి తెలిసిందే. మన యాక్షన్స్ కి తగినట్టే ఈక్వల్ గా రియాక్షన్స్ ఉంటాయి అనేది దాని అర్థం. దీనిని దర్శకుడు కర్మ సిద్ధాంతానికి లింక్ చేసిన విధానం బాగుంది. కోర్ ఐడియా చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదటి 15 నిమిషాల్లోనే 2 మర్డర్స్ జరుగుతాయి… దీంతో ఆడియన్స్ మరింత అటెన్షన్ తో సినిమాని చూడటం మొదలుపెడతారు. కానీ తర్వాత వచ్చే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ రిపీటెడ్ ఫీలింగ్ ను కలిగిస్తాయి. అందువల్ల ఫ్లాట్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఆడియన్స్ ను ఒకింత కన్ఫ్యూజన్ కి గురిచేస్తుంది. అయితే సెకండాఫ్ లో వచ్చే రాబరీ సీన్, ఫ్రెండ్స్ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఎపిసోడ్ బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా డ్రింకింగ్ ఎపిసోడ్ ఆ తర్వాత వచ్చే ఫైట్ సీన్ కూడా ఆకట్టుకుంటుంది.

క్లైమాక్స్ ట్విస్టులు కూడా బాగుంటాయి. అయితే విలన్ గ్యాంగ్ పై హీరో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వదిలేయడం అనేది ఒక ఇన్ – కంప్లీట్ ఫీలింగ్ కలిగిస్తుంది. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. సిన్జిత్ మ్యూజిక్ బాగుంది. కానీ పాటలు సినిమా ఫ్లోకి అడ్డంకిగా మారాయి. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ కి పాటలు అనవసరం అనిపిస్తాయి. బీజీఎం ఓకె. నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఏమీ అనిపించవు. కానీ ఎక్కడా తక్కువ అని పేరు పెట్టడానికి లేదు. సినిమాటోగ్రాఫర్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బాగుండేది.

Newton's 3rd Law Movie Review And Rating

విశ్లేషణ: థ్రిల్లర్ సినిమాలకి స్క్రీన్ ప్లే రేసీగా ఉండటం చాలా ముఖ్యం. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s 3rd Law) మంచి కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా .. కానీ ఫస్ట్ హాఫ్ లో కొంత సాగధీత ఉండటం, పాటలు వంటివి ఈ సినిమా స్థాయిని తగ్గించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఒక ఇన్- కంప్లీట్ ఫీలింగ్ ఇస్తుంది.

Newton's 3rd Law Movie Review And Rating

ఫోకస్ పాయింట్: మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఇన్-కంప్లీట్ థ్రిల్లర్

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Neha Pathan
  • #Newton's 3rd Law Movie
  • #Rajesh Karna
  • #sumanth

Reviews

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 mins ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

24 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 days ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version