Star Actress: ఈమె అందానికి ఫిదా అయిన కుర్రాళ్లు గుడి కూడా కట్టారంట!

ఈ ఫోటోలో ఉన్న పాపను ఎవరైనా గుర్తుపట్టారా, ఈ చిన్నారి పెద్ద స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా? ఇప్పుడు ఈమె అందానికి ఫిదా అయిన కుర్రాళ్లు గుడి కట్టారంటే ఎంత అందంగా ఉందో ఊహించగలం. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. ఈ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చాలా కాలమే అయ్యింది కానీ, కేవలం ఒక్క హిట్ తప్ప మరో బ్లాక్ బస్టర్ లేదు. చేసిన సినిమాలన్నీ దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి.

అయినప్పటికీ కూడా ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు రావడం ఆగలేదు, వరుసగా వస్తూనే ఉన్నాయి. యూత్ లో ఈమెకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్టార్ హీరోయిన్ కి కూడా లేదు. ఆమె పుట్టిన రోజు వచ్చిందంటే చాలు రాష్ట్ర వ్యాప్తంగా కేకులు కోస్తారు, అన్నదానాలు చేస్తారు , రక్త దానాలు కూడా చేస్తుంటారు. ఆమె పేరిట ఒక విగ్రహం కూడా తయారు చేసారు, ఒక ప్రాంతం లో గుడి కూడా కట్టారు. సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్ క్రేజ్ ని దక్కించుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు, నిధి అగర్వాల్.

నాగ చైతన్య హీరో గా నటించిన ‘సవ్య సాచి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె తొలిసినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నిధి అగర్వాల్, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రం చేస్తుంది.

ఈ సినిమాతో పాటు గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్- మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లో కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఈ హాట్ బ్యూటీ దశ మారినట్టే అని చెప్పొచ్చు. చూడాలి మరి నిధి అగర్వాల్ (Actress) తన క్రేజ్ కి తగ్గ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంటుందో లేదో అనేది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus