Niharika: విడాకుల ప్రకటన తర్వాత మొదటిసారి అలాంటి పోస్ట్ చేసిన నిహారిక!

నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీకి వచ్చి అనంతరం హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే హీరోయిన్ గా సక్సెస్ పొందలేనటువంటి ఈమె అనంతరం నిర్మాతగా మారిపోయారు.ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఒడిదుడుకులను ఉన్నారు. 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఇలా పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకి ఈమె తన భర్తకు విడాకులు ఇస్తున్నానని గత నెల నాలుగవ తేదీ అధికారికంగా తెలియజేశారు. ఇలా తన విడాకుల విషయాన్ని ప్రకటించినటువంటి నిహారిక గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే విడాకుల విషయంలో నిహారికదే తప్పు అన్నట్లు కొందరు వార్తలను సృష్టించారు. అయితే నిహారిక వీటన్నింటిని ఏమాత్రం లెక్క చేయకుండా తన కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.

ఇలా విడాకుల తర్వాత మరోసారి నిహారిక సోషల్ మీడియా వేదికగా మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనల గురించి తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే నిహారిక సోషల్ మీడియా వేదికగా మెహందీ పెట్టుకున్నటువంటి ఫోటోలను నిద్రపోతున్నటువంటి ఫోటోలను అలాగే ఐస్ క్రీమ్ తింటూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.

ఈ సందర్భంగా నిహారిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..మన జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి. అవి ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. మనం అలా జరగకూడదు అని కోరుకుంటే దాని సహజ గుణానికి మనం అడ్డుపడినట్లే. దీని కారణంగా లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళండిఈ ప్రయాణం ఎక్కడికి వెళుతుందో తెలుసుకున్నాక మీరే సర్ప్రైజ్ అవుతారు అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus