Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

నిహారిక కొణిదెల(Niharika Konidela) నిర్మాణంలో రూపొందిన ‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. నిన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ హైదరాబాద్,అమీర్ పేట్లోని AAA లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ టీం మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది.

Niharika Konidela

ఇందులో భాగంగా.. ‘చిరంజీవి గారు ఇటీవల ఓ సందర్భంలో సుస్మిత గారి గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి ఎవ్వరైనా రావచ్చు. క్యాస్టింగ్ కౌచ్ వంటి భయాలు ఏమీ ఉండవు ఇక్కడ. టాలెంట్ కలిగిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది అన్నారు. దానిపై మీరేమంటారు’ అంటూ నిహారికని ఓ రిపోర్టర్ ప్రశించడం జరిగింది.
 
అందుకు నిహారిక బదులిస్తూ.. ” ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేదానికి చాలా పెద్ద అర్ధం ఉంటుంది.చట్టప్రకారం అయితే దానికి 3,4 సెక్షన్లు ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో దానికి ఒక్కటే అర్ధం ఉంటుంది. పెదనాన్న చిరంజీవి గారు కూడా దాని గురించే మాట్లాడి ఉండొచ్చు. ఫోర్స్ ఫుల్ గా చేయడం అనేది ఏదైతే మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటామో.. కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు. ఇండస్ట్రీ మొత్తం ఇలాగే ఉంటుందని కాదు అని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. 
 
చిరంజీవి వ్యాఖ్యల విషయంలో నిహారిక ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా స్పందించారు అని చెప్పాలి. అటు సుస్మిత కానీ, నిహారిక కానీ పెద్ద కుటుంబానికి చెందిన వారు. అలాంటి వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ సాధారణ మహిళలని వీరిలా ట్రీట్ చేస్తారు అని చెప్పాలి. సో చిరు వంటి పెద్ద ఫ్యామిలీకి చెందిన వారు ‘క్యాస్టింగ్ కౌచ్’ అంశాన్ని టచ్ చేయకపోవడమే బెటర్. 
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus