సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2గా నిహారిక కొణిదెల మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేయనున్నారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫర్‌గా, పుల్లా విష్ణు వర్దన్ ప్రొడక్షన్ డిజైనర్ గా, యాక్షన్ కొరియోగ్రఫీగా విజయ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.

నటీనటులు-

సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి(జబర్దస్త్), రోహన్ (#90).

సాంకేతిక బృందం –

బ్యానర్ – పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, కథ – మానస శర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: మానస శర్మ & మహేష్ ఉప్పాల, ప్రొడ్యూసర్ – నిహారిక కొణిదెల, దర్శకత్వం – మానస శర్మ, మ్యూజిక్ – అనుదీప్ దేవ్, సినిమాటోగ్రాఫర్: రాజు ఎడురోలు, యాక్షన్ కొరియోగ్రాఫర్ : విజయ్, ఎడిటర్ – అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్ – రామాంజనేయులు, ఆర్ట్ డైరెక్టర్ – పుల్లా విష్ణు వర్ధన్, కాస్ట్యూమ్ డిజైనర్ – సంధ్య సబ్బావరపు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మన్యం రమేష్, ఈవెంట్ పార్టనర్ – యు వి మీడియా, డిజిటల్ మార్కెటింగ్ – టికెట్ ఫ్యాక్టరీ, పి.ఆర్.ఒ – సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus