ఇన్ఫ్లూయెన్సర్స్ లో స్టార్స్ లిస్ట్ అనేది తీస్తే.. అందులో మన తెలుగమ్మాయి నిహారిక ఎన్ ఎమ్(Niharika NM) కూడా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈమె కంటెంట్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే ఈమెకు సినిమా అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది అని చెప్పాలి. గతేడాది వచ్చిన ‘మిత్రమండలి’ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటించింది ఈ బ్యూటీ. ఆ సినిమా అంతగా ఆడలేదు.. ఒకవేళ అది వర్కౌట్ అయ్యి ఉంటే.. ఈమె క్రేజ్ మరింతగా పెరిగేది. అయినప్పటికీ ఇప్పుడు ఈమెకు ఆఫర్లు ఎక్కువగానే ఉన్నట్టు వినికిడి.
ఇదిలా ఉంటే.. కొన్నాళ్ళుగా ఈమె ఒక బాలీవుడ్ యాక్టర్‌తో డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అతను మరెవరో కాదు రాఘవ్ జుయల్. అవును ప్రస్తుతం నిహారిక,రాఘవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ తెగ వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలను తమ ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు ఈ కపుల్. వాటికి రెడ్-హార్ట్ సింబల్‌ను క్యాప్షన్‌గా పెట్టారు. అంతే వీళ్ళు రిలేషన్ షిప్లో ఉన్నారు అని అంతా డిసైడ్ అయిపోయారు.
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. వీరి రొమాంటిక్ ఫోటోల పై బాలీవుడ్ క్యూట్ బ్యూటీ, నటి షెహనాజ్ గిల్ కూడా ఓ ‘లవ్ సింబల్’ తో కామెంట్ చేసింది. దాంతో ఈ ప్రచారానికి మరింత బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే వీరి ప్రేమబంధం పెళ్లి వరకు వెళ్తుందా? లేదంటే మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.