Niharika: పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పిన నిహారిక!

  • January 8, 2024 / 06:10 PM IST

మెగా డాటర్ నిహారిక కెరియర్ మొదట్లో యాంకర్ గా వ్యవహరించారు. అనంతరం ఈమె హీరోయిన్ గా మూడు సినిమాలలో నటించారు. ఈ మూడు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇలా సినిమాల పరంగా నిహారిక ప్రయత్నాలు చేసిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లారు. ఇక ఈమె అత్తారింట్లో కూడా సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు తన భర్తతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి నిహారిక అనంతరం ఇద్దరు మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి తన భర్త నుంచి దూరంగా ఉన్నారు.

విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక స్వేచ్ఛ జీవిగా తనకిష్టం వచ్చినటువంటి ప్రదేశాలకు వెళుతూ తన జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గాను నిర్మాతగాను కొనసాగుతూ కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లికి సంబంధించి ఒక ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిహారిక (Niharika) పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు పెళ్లి అంటే ఇష్టం లేదని నన్ను పెళ్లి చేసుకోమంటే లేచిపోతానని మనకు పెళ్లి గిల్లి సెట్ అవ్వవు అంటూ చెప్పినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక హీరోయిన్ గా నటించిన సూర్యకాంతం సినిమాలో సుహాసిని నిహారికను పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఆ సమయంలో నిహారిక ఇలాంటి డైలాగ్స్ వేస్తుంది

అయితే ఈమెకి సినిమాలో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా పెళ్లంటే పెద్దగా ఇష్టం లేదని పెళ్లి తనకు సెట్ కాదని ఇలా పరోక్షంగా ముందుగానే చెప్పినప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ విషయాలను పట్టించుకోకుండా ఈమెకు పెళ్లి చేశారని అందుకే విడాకులు కూడా తీసుకుంది అంటూ పలువురు ఈ వీడియో పై కామెంట్లు చేస్తూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus