‘ఆచార్య’ అసలు ట్విస్ట్ లీక్ చేసేసిన నిహారిక..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 152 వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ను పరిసీలిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత కాజల్ మరోసారి చిరంజీవికి జంటగా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రాంచరణ్ అలాగే నిహారిక కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది.

దీని పై నిహారిక తాజాగా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఏకంగా కథ, ట్విస్ట్ లతో సహా బయటపెట్టేసింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇక నిహారిక చెప్పిన కథ ప్రకారం… గోవింద ఆచార్య(మెగాస్టార్) కంటే ముందే ఉద్యమం చేపట్టిన రాంచరణ్ ను కొందరు దుర్మార్గులు కుట్ర పన్ని రాంచరణ్ ను చంపేస్తారు. ఆ కథ మొత్తం గోవింద( మెగాస్టార్) కు వివరించే రాంచరణ్ సోదరి పాత్రలో నిహారిక కనిపిస్తుందట.

తరువాత వారి పై కసితో పగ తీర్చుకుని ఆ దుండగులను సంహరిస్తాడు గోవింద. ఇదే మెయిన్ పాయింట్ అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే మాస్ ఎలెమెంట్స్ తో పాటు మంచి సామజిక అంశంతో కూడిన మెసేజ్ కూడా ఉంటుందట. అయితే చరణ్ పాత్రకి ఓ హీరోయిన్ కూడా ఉంటుందని ఆ పాత్రలో రష్మిక కనిపిస్తుందని టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయం పై ఎటువంటి క్లారిటీ ఇంకా రాలేదు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus