Niharika, Varun Tej: వరుణ్ గురించి షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన నిహారిక!

  • November 16, 2021 / 08:03 PM IST

బుల్లితెర యాంకర్ గా, నటిగా నిహారిక ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా షోకు నిహారిక గెస్ట్ గా హాజరు కాగా తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. ఈ షోలోకి ఊసరవెల్లి సినిమాలోని నిహారిక నిహారిక పాటతో నిహారిక ఎంట్రీ ఇచ్చారు. అలీతో మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ గారు ఈ పాటను నాకోసమే రాశారని ఫిక్స్ అయ్యానని నిహారిక తెలిపారు.

తమన్నాకు కూడా ఈ సాంగ్ ఇంట్రో సాంగ్ గా ప్లే చేస్తారో లేదో తెలియదని తనకు మాత్రం ఈ సాంగ్ కచ్చితంగా ప్లే చేస్తారని నిహారిక పేర్కొన్నారు. చిన్నప్పుడు టీచర్ కావాలని అనుకున్నానని తర్వాత డాక్టర్ కావాలని భావించానని ఇంటర్ లో బైపీసీలో ఫిజిక్స్ ఉంటుందని తెలిసి ఆ గ్రూప్ లో చేరనని చెప్పానని నిహారిక వెల్లడించారు. సూర్యకాంతం క్యారెక్టర్ కోసమే పెట్టారని రియల్ లైఫ్ లో తాను సూర్యకాంతం కాదని నిహారిక తెలిపారు.

నాన్న తనను మమ్మీ అని పిలుస్తారని అన్న వరుణ్ తేజ్ నిహా అని పిలుస్తాడని బాగా ముద్దొస్తే బంగారం అని పిలుస్తాడని ఇంకా ఎక్కువ ముద్దొస్తే పంది అని పిలుస్తాడని నిహారిక కామెంట్లు చేశారు. నాన్న ఒక్కసారి కొట్టాడని నిహారిక పేర్కొన్నారు. చిన్నప్పుడు చాలా బక్కగా ఉన్నానని నిహారిక తెలిపారు. తన మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నిహారిక కామెంట్లు చేయగా తన చెవిలో పూలు లేవని అలీ చెప్పుకొచ్చారు. చిరంజీవి, నాగబాబు, పవన్ లో ఎవరు ఇష్టమని అడగగా నాన్న ఇష్టమని నిహారిక తెలిపారు. యాంకర్ నిఖిల్ కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు. వచ్చే సోమవారం రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus