Niharika: సాహసం చేసిన నిహారిక.. స్కై డైవింగ్ వీడియో వైరల్..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో కలిసి స్పెయిన్‌లో ఎంజాయ్ చేస్తుంది.ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్‌ రాజధాని బార్సిలోనాలో ఉన్నారు. ఈ క్రమంలో నిహారిక ఓ సాహ‌సం కూడా చేసిందండోయ్‌. ఆమె ఇలా చేయడం వల్ల ఏకంగా స్టార్‌హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది.విషయంలోకి వెళితే.. స్పెయిన్‌లో స్కై డైవింగ్ అనే చాలా ఫేమస్. దీంతో నిహారిక కూడా ధైర్యంగా ముందడుగు వేసి స్కైడైవింగ్ చేసింది.మొదట కొంచెం టెన్షన్ పడినా ఆ తర్వాత విమానంలో నుండీ దూకేసింది.

గాల్లో తేలుతున్నప్పుడు నిహారిక ఆనందం మాములుగా లేదు. ఛాన్నాళ్ల తర్వాత ఓ కొత్త అనుభూతిని పొందినట్టు ఆమె తెలియజేసింది. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, అంజలి, కళ్యాణి ప్రియదర్శన్ వంటివారు స్కైడైవ్ లో పాల్గొన్నారు. బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఊర్వశి రౌతెలా వంటి వారు కూడా స్కైడైవ్‌ను ఎంజాయ్ చేశారు.అలాంటి స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో ఇప్పుడు నిహారిక కూడా చేరడం విశేషం.

సినిమాల పరంగా స్టార్ హీరోయిన్ల సరసన చేరకపోయినప్పటికీ ఈ రకంగా అయినా స్టార్స్ పక్కన చోటు సంపాదించుకుంది నిహారిక. ఈ విషయాలను పక్కన పెట్టేసి నిహారిక స్కై డైవింగ్ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus