‘ఆచార్య’ లో మెగా ఫ్యామిలీ నుండీ మరొకరు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది అనే టాక్ నడుస్తుంది కానీ.. ఇంకా ఫైనల్ చెయ్యలేదు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో చరణ్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మాజీ నక్సలైట్ గా చరణ్ కనిపిస్తాడు అని.. చిరుతో కాంబినేషనల్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది మొదటి సారి కాదు.. గతంలో ‘మగధీర’ ‘బ్రూస్ లీ’ ‘ఖైదీ నెంబర్ 150’ లో కలిసి నటించారు. అయితే అవి గెస్ట్ రోల్స్ మాత్రమే. కానీ ఈసారి ఓ 30 నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తుంది. ఇందుకోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మెగా ఫ్యామలీ నుండీ మరొకరు కీలక పాత్ర పోషిస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. వివరాల్లోకి వెళితే… నిహారిక ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది అని టాక్ నడుస్తుంది. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా ఈమె నటించింది కానీ… అందులో ఈమెకు ఒక్క డైలాగ్ కూడా ఉండడు.మరి ఈసారి ఎలాంటి పాత్రలో కనిపిస్తుంది… ఇంతకీ ఈ వార్త నిజమేనా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus