మెగాడాటర్ నీహారిక పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. పెళ్లికి వారం ముందునుండే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ మొదలుపెట్టింది మెగాఫ్యామిలీ. అందరూ ఒకేచోటు చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. మెగాఫ్యామిలీలో పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు. నీహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ దగ్గరుండి మరీ పూర్తి చేశాడు వరుణ్ తేజ్.
ఈరోజు ఉదయం నాగబాబు కుటుంబం అలానే పెళ్లికొడుకు ఫ్యామిలీ కలిసి ఒక ఫ్లైట్ లో ఉదయ్‌పూర్ కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలానే చిరంజీవి, సురేఖా రామ్ చరణ్, ఉపాసనలు కలిసి మరో ఫ్లైట్ లో ఉదయ్‌పూర్ కి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ పెట్టుకున్న మాస్క్ మీదున్న చిరంజీవి ఫోటో గుర్తు అందరినీ ఆకట్టుకుంటుంది. వీరితో పాటు అల్లు వారి ఫ్యామిలీ కూడా ఉదయ్‌పూర్ కి చేరుకుంది.
అల్లు అరవింద్ అతడి భార్య, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ, అల్లు అయాన్, అల్లు అర్హలు కలిసి స్పెషల్ ఫ్లైట్ లో రాజస్థాన్ కి వెళ్లారు. ఈ ఫోటోలలో అల్లు అర్జున్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు. కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో చైతన్య, నీహారికల వివాహం జరగనుంది. వివాహం తరువాత సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో స్పెషల్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.