Nikhil Siddhartha : స్పై సినిమా షూటింగ్ పూర్తి కాగానే విడుదల చేశారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఒకరు. హీరోగా పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే కార్తికేయ 2 సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ స్పై సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచే సక్సెస్ అయినటువంటి తరుణంలో ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలను తెలియజేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఇందులో ఎక్కడా కూడా సరైన పాయింట్ లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదల సమయంలో నిర్మాతలకు హీరో నిఖిల్ మధ్య కూడా కాస్త విభేదాలు వచ్చాయి అనే విషయం మనకు తెలిసిందే.

నిఖిల్ ఈ సినిమాని విడుదల చేయకూడదని పట్టుబట్టగా నిర్మాతలు మాత్రం హీరోకి తెలియకుండా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దీంతో నిఖిల్ నిర్మాతల వ్యవహారి శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ స్పై సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన స్పై సినిమా విషయంలో చాలా తప్పులు జరిగాయని తెలిపారు. ఇక ఈ సినిమా విడుదల సమయంలో నాకు తెలియకుండానే విడుదల తేదీని ప్రకటించారని తెలిపారు.

అసలు స్పై సినిమా షూటింగ్ పూర్తి చేయకుండానే విడుదల చేశారు అంటూ ఈయన(Nikhil Siddhartha) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఇంకా పది రోజులు పాటు షూటింగ్ చేయాల్సి ఉంది ఆయనప్పటికీ సినిమా షూటింగ్ పూర్తి చేయకుండానే విడుదల చేశారని ఇకపై తన తదుపరి సినిమాలలో ఇలాంటి తప్పులు అసలు జరగవు అంటూ ఈ సందర్భంగా నిఖిల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ అందుకే సినిమా పరిస్థితి అలా ఉంది అంటూ కామెంట్ చేయడం మరికొందరు షూటింగ్ పూర్తి కాకుండా విడుదల చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus