“వాళ్ళిద్దరే”…గ్రేట్ అంటున్న నితిన్!!!

  • June 16, 2016 / 06:26 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరో స్థాయికి ఎండగాలి అనుకునే హీరోల్లో సీనియర్ లిస్ట్ లో ఉంటాడు నితిన్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 10ఏళ్లు గడుస్తున్నా, సూపర్ డూపర్ హిట్ అనుకోలేకపోయాడు. అయితే అదే క్రమంలో తాజాగా విడుదలయిన “అ..ఆ” సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ కోరిక కాస్త తీరింది నితిన్ కి. ఇదిలా ఉంటే, టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఆనందంతో సక్సెస్ మీట్స్ లో బిజీగా గడుపుతున్నాడు నితిన్.

అయితే అదే క్రమంలో సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ద్వారా అభిమానులకు తన ఆనందాన్ని తెలుపుతూ, హ్యాపీగా ఉన్నాడు. ఇక ఈ ఇంటర్‌వ్యూస్ లో భాగంగా…నితిన్ మాట్లాడుతూ, ఎన్టీఆర్, మెగాస్టార్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు…ఇంతకీ అవేమిటంటే…సినిమా ఇండస్ట్రీలో నచ్చిన మంచి డ్యాన్సర్లు ఇద్దరే ఇద్దరని వారే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని నితిన్ తెలిపాడు.

అయితే వారిలో స్పెష్యాలిటీ సైతం తెలుపుతూ…తాజాగా మా మూవీస్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చూశానని తనకు ఎంతో ఆశ్చర్యం వేసిందని ఇంత వయసులో కూడా పక్కన యంగ్ హీరోల దిమ్మ తిరిగేలా బెండ్ అవుతు స్టెప్పులేస్తున్న చిరంజీవి చూస్తుంటే ఎప్పటికీ ఆయనకు ఆయనే సాటి అనిపించారని అన్నారు. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ…ఈ జనరేషన్‌ హీరోల్లో అతనే బెస్ట్ డ్యాన్సర్ అని కితాబిచ్చాడు. ఇక ఈ కామెంట్స్ తో ఎన్టీఆర్ మరియు, చిరు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus