Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Advertisement

వరుస ఫ్లాపులతో హీరో నితిన్(Nithiin) బాక్సాఫీస్ రేసులో కాస్త వెనుకబడ్డాడు. గతేడాది వచ్చిన ‘తమ్ముడు’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో.. ఏకంగా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.

Nithiin

అయితే ఆ బ్రేక్‌లో ఖాళీగా ఉండకుండా సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం పక్కా స్కెచ్ వేసుకున్నాడు. ఏరికోరి ఏకంగా మూడు స్క్రిప్టులను లాక్ చేశాడు. ఇప్పుడు ఎట్టకేలకు తన సైలెన్స్ బ్రేక్ చేస్తూ మళ్లీ కెమెరా ముందుకు రావడానికి ఫుల్ రెడీ అయ్యాడు.

ఈ ఏడాది బ్రేక్ తర్వాత నితిన్ చేయబోయే మొదటి ప్రాజెక్ట్ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై పట్టాలెక్కనుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంతో సోము, నర్రి అనే కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. మే 4న హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభం కానుందని సమాచారం. ఏమాత్రం లేట్ చేయకుండా మే 6 నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసి.. ఎక్కడా గ్యాప్ లేకుండా ఫాస్ట్ షెడ్యూల్స్‌లో ఈ సినిమాను కంప్లీట్ చేయాలని నితిన్ టార్గెట్‌గా పెట్టుకున్నాడు.

ఇందులో నితిన్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు ఎండ్ స్టేజ్‌కి వచ్చేశాయి. టాలీవుడ్‌లోని టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారు.ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే.. వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో మరో మూవీ స్టార్ట్ చేయడానికి కూడా నితిన్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.మొత్తానికి ఏడాదంతా సైలెంట్ గా ఉన్న నితిన్, ఇప్పుడు సడెన్ గా స్పీడ్ పెంచడం మంచి విషయమే అని చెప్పాలి.

ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus