టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin Kumar) గత కొంతకాలంగా వరుస ప్లాపులతో హిట్ ట్రాక్‌ను కోల్పోయాడు. ఒకప్పుడు ‘అ ఆ’ (A AA) లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో భారీ మార్కెట్‌ను సొంతం చేసుకున్న నితిన్, చివరగా వచ్చిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’తో (Extra Ordinary Man) మాత్రం ఊహించని డౌన్ ఫాల్ చూశాడు. 78 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో అ ఆ టాప్ పొజిషన్‌లో నిలిచినప్పటికీ, రీసెంట్‌గా వచ్చిన సినిమాలు 10-15 కోట్లకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ (Robinhood) అతనికి లైఫ్-చేంజింగ్ మూవీగా మారనుంది.
మరో విశేషం ఏంటంటే, భీష్మ (Bheeshma) కాంబోలో మళ్లీ నితిన్, వెంకీ కుడుముల (Venky Kudumula) కలవడం. 2020లో వచ్చిన ‘భీష్మ’ సూపర్ హిట్ కావడంతో, అదే సక్సెస్‌ను పునరావృతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా, కనీసం 30 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, గత సినిమాల రిజల్ట్ చూస్తే, ఈ టార్గెట్ సాధించడం అంత తేలికైన పని కాదు.
నితిన్ గత టాప్ బాక్సాఫీస్ కలెక్షన్స్ చూస్తే:
1. అ ఆ – ₹78 కోట్లు గ్రాస్, ₹47.4 కోట్లు షేర్
2. భీష్మ – ₹50 కోట్లు గ్రాస్, ₹28.6 కోట్లు షేర్
3. ఇష్క్ – ₹40 కోట్లు గ్రాస్, ₹22.6 కోట్లు షేర్
4. రంగ్ దే (Rang De) – ₹40 కోట్లు గ్రాస్, ₹22.6 కోట్లు షేర్
5. గుండెజారి గల్లంతయ్యిందే – ₹20 కోట్లు గ్రాస్, ₹10.5 కోట్లు షేర్
నితిన్ ట్రాక్ రికార్డు చూస్తే, అతనికి 50 కోట్ల వరకు కలెక్షన్లు సాధించే సత్తా ఉంది. కానీ, రీసెంట్‌గా అతను చేసిన సినిమాలు కంటెంట్ పరంగా బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో రాబిన్ హుడ్ విజయానికి మౌత్ టాక్ చాలా కీలకం కానుంది. ప్రస్తుతం విడుదలైన టీజర్, పాటలు మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరోవైపు, కామెడీ ఫిల్మ్ మాడ్ స్క్వేర్ పోటీగా ఉండటం కొంత ఇబ్బందికరంగా మారొచ్చు. కానీ నితిన్-వెంకీ కుడుముల మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయితే, రాబిన్ హుడ్తో నితిన్ కెరీర్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఇక ఫలితం ఏమిటనేది మార్చి 28న తెలియనుంది.