‘వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు’ అంటున్నారు ప్రముఖ నటులు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu). బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న కొంతమంది సినీ సెలబ్రిటీలపై నిన్న కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో విష్ణుప్రియ (Vishnupriya), సురేఖ వాణి (Surekha Vani) కూతురు సుప్రీత (Supritha) వంటి వారు ఉన్నారు. అలాంటి వారిని సైబర్ టెర్రరిస్టులు అంటూ సజ్జనార్ ప్రస్తావించడం జరిగింది. ఆ బెట్టింది యాప్స్ వల్ల ‘యువత తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని, రాష్ట్రం కూడా ఆర్థికంగా వెనకపడుతుందని..
అందుకే ఈ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని’ ఆయన హెచ్చరించారు. దీనిపై సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కూడా స్పందించారు.”ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది. కానీ కొంత మంది అడ్డదారులు తొక్కుతూ. తొక్కిస్తూ అనవసరమైన వ్యసనాలకు బానిసలవుతున్నారు. రీసెంట్‌గా ఎంతో మందిని ప్రభావితం చేసిన బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల డబ్బులు సంపాందించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మాయా మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు.
వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్‌లను డిలీట్ చేయండి. ఈ యాప్‌కు దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ల కోసం, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒకసారి ఆలోచించండి ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం, సజ్జనార్ సార్ సిద్ధంగా ఉన్నారు. సదా మీ ప్రేమకు బానిస… మీ సంపూర్ణేష్ బాబు” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ‘సంపూర్ణేష్ బాబు, సినిమాల్లో ఎంత సిల్లీ పాత్రలు చేసినా.. నిజజీవితంలో చాలా బాధ్యతతో వ్యవహరిస్తారని.. ఆయనకు సామాజిక బాధ్యత ఎక్కువ’ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సంపూర్ణేష్ బాబుని ప్రశంసిస్తున్నారు.
#SayNoToBettingApps pic.twitter.com/lq0kmy95l5
— Sampoornesh Babu (@sampoornesh) March 17, 2025