యంగ్ హీరో నితిన్-వక్కంతం వంశీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఠాగూర్ మధు, సుధాకర్ రెడ్డి నిర్మించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నుండి సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే షూటింగ్ కూడా మొదలుకాకుండానే సినిమా బిజినెస్ జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే శాటిలైట్, హిందీ డబ్బింగ్, డిజిటల్ ఆల్ ఇండియా రైట్స్ ఇలా అన్నీ ఆదిత్య మ్యూజిక్ సంస్థ కొనుగోలు చేసింది.
ఇక కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే నిర్మాతల దగ్గర ఉంటాయి. టోటల్ నాన్ థియేట్రికల్ హక్కుల కింద రూ.21 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. థియేటర్ హక్కులు ఎలా లేదన్నా.. రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమాను రూ.30 కోట్ల బడ్జెట్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే సినిమాకి పది కోట్ల లాభం అన్నమాట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారు.
కానీ ప్రస్తుతం ఆమె చాలా బిజీగా అందడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది. ప్రస్తుతం దర్శకనిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె డేట్స్ ప్రకారం షూటింగ్ షెడ్యూల్స్ మార్చాలనుకుంటున్నారు. ప్రస్తుతం నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!