వరుణ్ తేజ సినిమాలో నితిన్?

Advertisement

అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమా పక్కన పెడితే ఇప్పటివరకూ ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మధ్యలో వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘డీజే’ చిత్రాలు యావరేజ్ గా మాత్రమే నిలిచాయి. ఇక ఈ డైరెక్టర్ కు పెద్దగా అవకాశాలు కూడా ఇవ్వట్లేదు మిగిలిన హీరోలు. ఇలాంటి తరుణంలో వరుణ్ తేజ్ ఛాన్స్ ఇచ్చాడు. తరువాత ఈయన బిజీ అవ్వాలంటే ఈ సినిమా కచ్చితంగా హిట్టవాల్సి ఉంది. ‘వాల్మీకి’ చిత్రం సెప్టెంబర్ 20 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్ జోడిస్తున్నాడు హరీష్.

ఇప్పటీకే కోలీవుడ్ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీళ్ళకు జోడీగా.. పూజా హెగ్డే – మృణాళిని రవి నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్. ’14 రీల్స్ ప్లస్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం కథ ప్రకారం మరో హీరో గెస్ట్ రోల్ ఇవ్వాల్సి ఉందట. తమిళంలో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ ఇచ్చాడు. తెలుగులో ఆ పాత్ర నితిన్ చేసినట్టు సమాచారం. హరీశ్ శంకర్ రిక్వెస్ట్ చేయడంతో నితిన్ ఓకే చెప్పాడట. తనతో ‘లై’ సినిమా చేసిన నిర్మాతలు కాబట్టి…వారితో నితిన్ కు మంచి స్నేహ బంధం ఉంది కాబట్టి ఈ రోల్ పై చాలా శ్రద్ద పెట్టి చేశాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus