‘నితిన్’తో ‘రచ్చ’ చేయిస్తా!!!

  • May 10, 2016 / 06:45 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో దశాబ్ద కాలంగా హిట్స్, ఫ్ల్యాప్స్ తో సంభంధం లేకుండా వరుస సినిమాలతో దస్సుకుపోతున్నారు హీరో నితిన్. ఒక రకంగా చెప్పాలి అంటే నితిన్ ఇప్పుడున్న హీరోలకు సీనియర్ హీరో, అంటే ఇప్పుడున్న కుర్ర హీరోలందరూ జూనియర్స్ అన్న మాట. ఇదిలా ఉంటే నితిన్ లోని పట్టుదల, హార్డ్ వర్క్ ఆయన్ని బడా హీరోగా నిలబెట్టింది. ఎందుకంటే వరుస పరాజయాలు వెంటాడుతున్నా ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా వరుసా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు నితిన్.

అయితే ఎన్నో భారీ ఫ్లాప్స్ తరువాత రెండు వరుస హిట్స్ అందుకున్న నితిన్ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. చిన్నదానా నీకోసం, కొరియర్ బోయ్ కళ్యాణ్ ఫ్లాప్ అవ్వడంతో రాబోయే ‘అఆ’ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు మన లవర్ బోయ్. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం…చరణ్ కెరియర్ కష్టాల్లో ఉన్నప్పుడు రచ్చ అంటూ సూపర్ హిట్ అందించిన సంపత్ నంది నితిన్ కోసం పక్కా మాస్ కధను రెడీ చేసి నితిన్ కు చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కధ విన్న నితిన్ ఓకే చెప్పినట్లు సైతం తెలుస్తుంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నితిన్….కాస్త చేంజ్ ఓవర్ ఇచ్చి…మాస్ సినిమాల మీద ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇదే క్రమంలో సంపత్ తో సినిమాకు ఒకే చెప్పాడు. మరి…ఈ సినిమాను సంపత్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus