“దువ్వాడ జగన్నాధం”తో సూపర్ హిట్ అందుకొన్న టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఆ సినిమా విజయాన్ని వీరలెవల్లో ఎంజాయ్ చేసి కొంత విరామం అనంతరం ఓ మాంచి మల్టీస్టారర్ ను కన్ఫర్మ్ చేశాడు. యంగ్ స్టార్ హీరోస్ నితిన్, శర్వానంద్ లు హీరోలుగా నటించనున్న ఈ క్రేజీయస్ట్ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. తొలుత నాని-రాజ్ తరుణ్ లతో తీద్దామనుకొన్న ఈ మల్టీ స్టారర్ దిల్ రాజు ఇన్వాల్వ్ మెంట్ తో రేంజ్ పెరిగింది.
ఇప్పటికే నితిన్ శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో “శ్రీనివాస కళ్యాణం” కన్ఫర్మ్ చేయగా.. ఇది మూడో సినిమా అవుతుంది. అలాగే.. “శతమానం భవతి” అనంతరం దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ నటించబోయే రెండో సినిమా ఇది. ఇక “రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాధం” అనంతరం హరీష్ శంకర్ కూడా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కించబోయే నాలుగో చిత్రమిది. డిసెంబర్ లో లాంఛనంగా ప్రారంభమవ్వనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి మొదటివారంలో మొదలయ్యే అవకాశం ఉంది.
అసలు మల్టీస్టారర్స్ ఇక తెలుగులో రావేమో అని అందరూ అనుకొంటున్న తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బబౌ-విక్టరీ వెంకటేష్ లతో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రాన్ని రూపొందించి మల్టీ స్టారర్ శకానికి పునాది వేసిన దిల్ రాజు ఇప్పుడు నితిన్-శర్వాల ప్రొజెక్ట్ ను ప్రొడ్యూస్ చేస్తుండడంతో ఇకముందు మరిన్ని మల్టీస్టారర్లు తెలుగులో చూడవచ్చన్న నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది.