‘రెమో’గా నితిన్..?

కెరీర్ ఆరంభంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు నితిన్. ‘ఇష్క్’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ హీరో ‘అఆ’తో మరో అడుగు ముందుకేశాడు. ఈ విజయాలను నిలుపుకునేందుకు కథల పట్ల జాగ్రత్త వహిస్తున్న నితిన్ ఇటీవల హను రాఘవపూడి తెరకెక్కించనున్న సినిమాని మొదలెట్టాడు. దీంతోపాటు మరికొందరు దర్శకుల కథలు విన్న నితిన్ కు ఇటీవల ఓ తమిళ దర్శకుడు కూడా కథ వినిపించాడట.
తమిళనాట వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రెమో’.

ప్రచార చిత్రాలతోనే ఆసక్తి రేపిన ఈ సినిమా ఈ దసరాకి కోలీవుడ్ లో సందడి చేయనుంది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన ఈ సినిమాతో భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నితిన్ తో చర్చలు జరిపింది ఈ దర్శకుడే. ‘రెమో’ సినిమానే ఇక్కడ తెలుగులో రీమేక్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఏమిటన్నది వారికే తెలియాలి. ఈ కథ నితిన్ వరకు రావడానికి ‘ఇష్క్’ సినిమా సమయంలో పీసీ శ్రీరామ్ తో ఏర్పడిన పరిచయమే కారణం. గౌతమ్ మీనన్ నిర్మాతగా నితిన్ చేసిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా చేశాడు. ఇలా తమిళ వర్గాలకు పరిచయస్తుడిగా మారాడు నితిన్. అన్నిటికీ మించి దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఇతగాడికి మంచి సాన్నిహిత్యం ఉంది. గనక నితిన్ తర్వాతి సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus