Nithiin, Pawan Kalyan: నితిన్ మూవీ అనౌన్స్‌మెంట్ కు అసలు కారణమిదా?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ గురించి చాలా సందర్భాల్లో పాజిటివ్ గా చెప్పుకొచ్చిన నితిన్ తన సినిమాల్లో పవన్ సినిమాలకు సంబంధించిన రెఫరెన్స్ లు ఉండే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పవన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడింది.

క్రిష్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా సైతం ఇదే డేట్ కు రిలీజ్ కానుందని ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఫేవరెట్ హీరోకు పోటీగా నితిన్ తన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో నితిన్ ఎందుకు ఈ విధంగా చేశారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ 29 కాగా ఈ సినిమా షూటింగ్ మొదలుకాకపోవడంతో ఆ తేదీకి ఈ సినిమా రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం హరిహర వీరమల్లు ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కాదని నితిన్ కు సమాచారం ఉందని ఆ కారణం వల్లే నితిన్ ఆ తేదీన తన సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారని వినిపిస్తోంది. ఒకవేళ హరిహర వీరమల్లు ఏప్రిల్ 29వ తేదీన రిలీజైతే మాత్రం నితిన్ తన సినిమా రిలీజ్ డేట్ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం ఉంది. ఏప్రిల్ 29 నాటికి విద్యార్థుల పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి ఆ తేదీవైపు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే గతేడాది, ఈ ఏడాది కరోనా వల్ల ఏప్రిల్, మే నెలలలో థియేటర్లు మూతబడిన నేపథ్యంలో సమ్మర్ లో రిలీజయ్యే సినిమాలను కరోనా సైతం టెన్షన్ పెడుతుండటం గమనార్హం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus