Nithin: మాచర్ల డైరెక్టర్ పై నితిన్ షాకింగ్ కామెంట్స్!

నితిన్ హీరోగా రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో మాచర్ల నియోజకవర్గం పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన రారా రెడ్డి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఆగష్టు నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో నితిన్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. నితిన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో మాచర్ల నియోజకవర్గం సినిమా తెరకెక్కుతుండగా ఎన్.సుధాకర్ రెడ్డి నిఖితా రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నితిన్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

రారా రెడ్డి సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ అభిమానులు ప్రతి ట్వీట్ లో డ్యాన్స్ చేయాలని కామెంట్లు పెడుతుంటారని అభిమానుల కోసమే మాచర్ల నియోజకవర్గం సినిమాలో హై డ్యాన్స్ నంబర్స్ పెట్టామని చెప్పుకొచ్చారు. రిలీజైన లిరికల్ వీడియోలో డ్యాన్స్ తక్కువగా ఉన్నా ఫుల్ సాంగ్ లో డ్యాన్స్ ఎక్కువగా ఉంటుందని నితిన్ కామెంట్లు చేయడం గమనార్హం.

రాజశేఖర్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడని సినిమా తేడా వస్తే దర్శకుని అడ్రస్ చెబుతానని నితిన్ తెలిపారు. జానీ మాస్టర్ తో ఫస్ట్ టైమ్ రారా రెడ్డి సాంగ్ కోసం పని చేశానని నితిన్ చెప్పుకొచ్చారు. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు నితిన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus