Nithya Menen: కావాలనే నా గురించి తప్పుగా చెబుతున్నారు : నిత్యామీనన్

హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా.. సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తన సత్తా చాటింది. ‘స్కైలాబ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారింది. తెలుగులో ఆమె చివరిగా ‘భీమ్లానాయక్’ సినిమాలో కనిపించింది. రీసెంట్ గా ‘తిరు’ అనే డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది నిత్యామీనన్.

ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ పెళ్లి వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఈ వార్తలను ఖండించింది. తన పెళ్లి గురించి బయట వస్తోన్న వార్తల్లో అసలు నిజం లేదని.. అందరూ కలిసి క్రియేట్ చేసిన మంచి స్టోరీ అది అంటూ వెటకారంగా చెప్పుకొచ్చింది. ఏడాది కాలంగా వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నానని.. అదే సమయంలో కాలు బెణికి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.

ఆ సమయంలో కథలు చెబుతామని కొందరు అప్రోచ్ కాగా.. రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కథలు వినడం లేదని చెప్పానని.. దీంతో నిత్యా కథలు ఎందుకు వినడం లేదనే ప్రశ్న ఎదురైందని చెప్పింది. అక్కడనుంచి ఆమె కథలు వినడం లేదంటే పెళ్లి చేసుకుంటుందేమోననే వార్తలు పుట్టేశాయని చెప్పుకొచ్చింది. ఇక సినిమా ఇండస్ట్రీలో తనను బ్యాక్ చేశారనే వార్తలు వచ్చాయని.. కావాలనే తన గురించి తప్పుగా చెబుతారని వాపోయింది.

ఒకరు మనకంటే బాగా ఎత్తులో ఉంటే కిందకి లాగాలని కొంతమంది అనుకుంటారని.. వారి ప్రలోభాలకు లొంగనప్పుడు ఆమెతో కష్టమనే వార్తలు పుట్టిస్తారని చెప్పుకొచ్చింది. తనతో పని చేసిన వాళ్లెవరూ కూడా తన గురించి తప్పుగా మాట్లాడరని, తనతో పనిచేయని వారే అలా చెబుతుంటారని చెప్పింది. రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారని.. మ‌నం వాళ్ల‌లాగా కింద‌కెళ్లి మేనేజ్ చేయాల్సిన అవ‌సరం లేదని తెలిపింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus