Nithya Menen: వైరల్ అవుతున్న నిత్య మీనన్ ప్రెగ్నెన్సీ కిట్ పోస్ట్..!

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్‌ల సరోగసీ వివాదంలో క్లారిటీ ఇచ్చినా కానీ ఇంకా చాలామందికి కన్ఫ్యూజన్‌గానే ఉంది. ఇంతలో మరోనటి ప్రెగ్నెన్సీ కిట్ పిక్ షేర్ జనాల్ని గందరగోళంలో పడేసింది. అసలేం జరిగింది అనేది వివరంగా చూద్దాం.. మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నిత్య మీనన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

తను సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. రీసెంట్‌గా ఆమె ప్రెగ్నెన్సీ కిట్ ఫొటో పోస్ట్ చేసి అభిమానుల్ని అయోమయంలో పడేసింది. పాజిటివ్ కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో పాటు పాసిఫైయర్ ఉన్న ఇమేజ్ పోస్ట్ చేస్తూ ‘అండ్, ది వండర్ బిగిన్స్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవడమే కాక.. మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక నిత్యా ఫ్యాన్స్, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.సెలబ్రిటీలకు కూడా నిత్యా తన పోస్ట్ ద్వారా ఏం చెప్పబోతుందనేది అర్థం కాలేదు..

‘‘ఏంటి నిత్య మీనన్‌కి పెళ్లైపోయిందా?.. తనింకా సింగిల్ ఏమో అనుకున్నా.. ఈ పోస్ట్ తన కొత్త సినిమా ప్రమోషన్‌లో పార్ట్’’ అంటూ ఎవరికి తోచినట్టు వాళ్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ చాలామంది చూడగానే ఈ న్యూస్ నిజమేనేమో అనుకున్నారు. ఇదంతా ఎందుకయ్యా అనంటే.. నిత్య ప్రస్తుతం ‘వండర్ వుమెన్’ అనే ప్రాజెక్ట్ చేస్తోంది. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవడంతో.. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా..

తన క్యారెక్టర్‌కి సంబంధించి ఇలా ఫొటో ద్వారా హింట్ ఇచ్చింది అనంటున్నారు. ఇటీవలే ధనుష్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న నిత్యా మీనన్, అభిషేక్ బచ్చన్‌తో నటించిన హిందీ సిరీస్ ‘బ్రీత్ ఇన్‌టు ది షాడోస్’ సెకండ్ సీజన్‌లోనూ నటిస్తోంది. మొత్తానికి ప్రెగ్నెన్సీ కిట్ పిక్ పోస్ట్ చేసి అందరికీ షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ ఇచ్చిందీ టాలెంటెడ్ బ్యూటీ.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus