నావి కానీ ఫోటోలతో నా పరువు తీస్తున్నారు.!

  • May 7, 2018 / 01:22 PM IST

ఆన్ లైన్ లో ట్రెండ్ అవ్వడం ఎలా అని ఆలోచించీ.. చించి కొందరు హీరోయిన్లకు, వారి మిత్ర బృందానికి తలపోటు వస్తుంటే.. ఒక యువ కథానాయికకు మాత్రం ఆన్ లైన్ లో ట్రెండ్ అవ్వడం వల్ల లేనిపోని తలపోట్లు మొదలయ్యాయ్. పబ్లిసిటీ తెచ్చిన తలపోట్లేంటనుకొంటున్నారా.. అసలు మేటర్ ఏంటంటే, ఒక రెండుమూడు రోజులుగా “నివేతా పేతురాజ్ హాట్ ఫోటోస్, బికినీ పిక్చర్స్” అంటూ ఓ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజానికి ఆ ఫోటోలు నివేతా పేతురాజ్ వి కావు, ఎవరో వర్షిణి అనే మోడల్ తీయించుకొన్న స్పెషల్ ఫోటోలు. ఆ ఫోటోల్లో కాస్త ముక్కు, మొహం సేమ్ నివేతాలా ఉండడం వలన అందరూ అవి నివేతా ఫోటోస్ అని ఫిక్స్ అయిపోయారు.

ఈ విషయమై కాస్త లేట్ గా స్పందించిన నివేతా పేతురాజ్.. “ఒక్కోసారి సైలెంట్ గా ఉండడం కూడా పాపం అయిపోతుంది. రెండ్రోజుల నుంచీ చూస్తున్నాను, కనీసం మీడియా నుంచి ఒక్కరైనా నన్ను సంప్రదించకుండా అవి నా ఫోటోలే అంటూ అన్నీ వెబ్ సైట్స్ లో ప్రమోట్ చేస్తున్నారు. నాకు చాలా కోపం వచ్చింది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది నిజమేమో అనుకున్నారు. చాలా బాధపడ్డారు కూడా. ఇకనైనా ఈ తరహా ఫోటోలు, వార్తలు పబ్లిష్ చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకోవడం సబబు అని చెబుతున్నాను” అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ అమ్మడు తెలుగులో “మెంటల్ మదిలో” అనే సినిమాలో నటించింది. ఆమె తాజా చిత్రం “టిక్ టిక్ టిక్” జూన్ 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus