సినీ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోలు , హీరోయిన్ లు సామాజిక బాధ్యత పట్ల వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తుంటారు. ఇంత జనాభా నివసిస్తున్న ఇండియాలో మనం ఎలా ఎదుటి వ్యక్తితో ఎలా నడుచుకోవాలి ?. ఏ విధంగా సామాజిక సృహ ను కలిగి ఉండాలి? ఇదే కోవకు వస్తుంది హీరోయిన్ నివేతా పేతురాజ్. హీరోయిన్ నివేతా పేతురాజ్ ట్విట్టర్ ద్వారా చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశంలో ప్రతి రోజు జనాభా పెరుగుతూ వస్తుంది.
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ తప్పనిసరిగా అలవరచుకోవాలి అని ఆమె తేల్చిచెప్పింది. క్యూలను పాటించకపోవడం, రోడ్లపై ఉమ్మివేయడం, నియమాలు పట్టించుకోకపోవడం, ఇతరులపై అనుచితంగా ప్రవర్తించడం, ఇవన్నీ రోజువారీగా జరుగుతున్నప్పటికీ, వాటిపై అవగాహన చాలా మందిలో లేదని ఆమె వ్యాఖ్యానించింది. “ఇంత మంది జనాభాలో క్రమశిక్షణ పాటించే వారు చాలా కొద్దిమంది మాత్రమే. అందుకే సివిక్ సెన్స్‌పై ప్రత్యేక శిక్షణ అవసరం” అని ఆమె పోస్టులో పేర్కొనడం నెట్టింట చర్చనీయాంశమైంది.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా రాణించిన నివేతా పేతురాజ్, మెంటల్ మదిలో, చిత్రలహరి, పాగల్, రెడ్, పొలీస్ వేరియేషన్ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించారు. రీసెంట్‌గా వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో తన ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగొచ్చన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.