బాహుబలిలో తనకిష్టమైన రోల్ చెప్పిన నివేదా థామస్!

  • September 21, 2017 / 11:36 AM IST

జెంటిల్ మ్యాన్ సినిమా ద్వారా తెలుగు వారికీ పరిచయమైన నివేదా థామస్.. మళ్ళీ నానితో నిన్నుకోరి సినిమాలో జత కట్టి మరో హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి ఆకట్టుకున్నారు. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న నివేదా అనేక ఆసక్తికర సంగతులు వెల్లడించారు. ”ఎన్టీఆర్‌ నిబద్ధత కలిగిన వ్యక్తి. సినిమా కోసం చాలా కష్టపడతారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయనో కరెంట్‌తీగ” అంటూ తారక్ పై ప్రశంసలు గుప్పించారు.

‘బాహుబలి’ చిత్రం విడుదల ముందు నుంచే తాను దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి పెద్ద అభిమానినని అన్నారు. ఆయన దర్శకత్వంలో నటించాలనుందని చెప్పారు. అయితే బాహుబలి సినిమాలో ఏ పాత్రలో నటించడానికి ఇష్టపడుతారని.. ఆమెను ప్రశ్నించగా..  నటీమణులు అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ చేసిన క్యారెక్టర్స్ ఎంచుకోకుండా..  ప్రభాస్ పోషించిన బాహుబలి పాత్రలో నటించడానికి ఇష్టపడతానని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus