కరాటే నేర్చుకున్నాను : నివేదా థామస్‌

నేచురల్ స్టార్ నాని “జెంటిల్‌మేన్” సినిమాతో నివేతా థామస్ తెలుగు వారికి పరిచయమంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. దాని తర్వాత కూడా నానితో నిన్నుకోరి మూవీ చేసి హిట్ అందుకుంది. హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకుంది. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ చిత్రం విజయం తర్వాత ఆమెకు అనేక అవకాశాలు వచ్చినా చేయలేదు. అందుకు డిగ్రీ ఆఖరి సెమిస్టర్‌ పరీక్షలే కారణమని నివేదా రీసెంట్ గా వెల్లడించింది. పరీక్షలు పూర్తి కావడంతో ఓ చిత్రానికి సైన్ చేసింది. కళ్యాణ్ రామ్ సరసన నటించడానికి ఒకే చెప్పింది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె తన స్కూల్ డేస్ సంగతులను గుర్తు చేసుకుంది. తనని అందరూ రౌడీ అని పిలిచేవారని తెలిపింది. ”చిన్నప్పటి నుంచీ స్కూల్‌లో నేను లీడర్‌ని. తప్పుడు చేసిన మీద ఆథారిటీ చెలాయిస్తూ ఉండేదాన్ని. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. పైగా నాకు కరాటే వచ్చు. స్కూల్‌, కాలేజ్‌లో ఎవరి ప్రవర్తన అన్నా తేడాగా అనిపిస్తే ఎదుటి వ్యక్తి ఆడ అయినా మగ అయినా మ్యాన్‌ హ్యాండిలింగ్‌ తప్పేది కాదు. అందుకే నా స్నేహితులంతా నన్ను ‘నువ్వు రౌడీలా బీహేవ్‌ చేస్తున్నావు’ అని ఆటపట్టిస్తుండేవారు. అలా రౌడీ అనే ట్యాగ్‌ స్కూల్‌లోనే తగిలించేశారు” అని నివేత వెల్లడించారు. అయితే అటువంటి రోల్ ఇంకా ఆమెకు దొరకలేదు. దొరికితే మాత్రం రఫ్ ఆడించేలా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus