Vijay, Sukumar: విజయ్‌ – సుకుమార్‌ సినిమా ఉందా? లేదా?

  • April 12, 2022 / 02:50 PM IST

విజయ్‌ దేవరకొండ సినిమా గురించి, అతని పర్సనల్‌ లైఫ్ గురించి మీడియా ఏదైనా మాట్లాడితే, ఏదైనా రాస్తే విజయ్‌ దేవరకొండకు చాలా కోపం వచ్చేస్తుంది. ట్వీట్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు… ఆయనేదో చేయకపోతే, లేక ఏదైనా అంటేనో కచ్చితంగా మీడియాలో రాస్తుంటారు. అలా ఇప్పుడు విజయ్‌.. గురించి మరో ప్రశ్న అభిమానుల్లో, సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. దాని గురించే ఈ వార్త.

విజయ్‌ దేవరకొండ – సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఆ మధ్య అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఫాల్కన్‌ క్రియేషన్స్‌ పతాకంపై కేదార్‌ సెలగమ్‌శెట్టి నిర్మిస్తారని అప్పుడు చెప్పారు. ఈ అనౌన్స్‌మెంట్‌ వచ్చి చాలా రోజులైంది. అప్పటి నుండి సినిమా ఎప్పుడు అంటే.. ఇదిగో ఇప్పుడు, అప్పుడు అని వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఇంకా ఈ సినిమా మీద క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు మరోసారి సినిమా మీద పుకార్ల మేఘాలు అలముకుంటున్నాయి.

ఇప్పుడు పుకార్లు రావడానికి కారణం… విజయ్‌ నెక్స్ట్‌ సినిమాల లైనప్పే. ‘లైగర్‌’ విడుదల కాకుండానే పూరి జగన్నాథ్‌తో తర్వాతి సినిమా మొదలుపెట్టేశాడు విజయ్‌ దేవరకొండ. అయితే అంతకంటే ముందే శివ నిర్వాణ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా సంగతిని కాసేపు పక్కనపెట్టి పూరి ‘జేజీఎం’ స్టార్ట్‌ చేసేశారు. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు పూరి చాలా రోజులే తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత శివ నిర్వాణ సినిమాకు మరో ఆరు నెలలు.

అలా 2022లో కానీ 2023లో కానీ సుకుమార్‌తో సినిమా వచ్చేలా లేదు. అయితే ఇక్కడో విషయం గుర్తు చేసుకోవచ్చు. మొన్నీ మధ్య ‘పుష్ప’ రిలీజైనప్పుడు విజయ్‌ టీమ్‌ మొత్తానికి విషెష్‌ చెప్పాడు. పనిలో పనిగా తన సినిమా ఉందని, అదిరిపోతుందని కూడా ఆ ట్వీట్‌లో యాడ్‌ చేసేశాడు. అదేనండీ ‘2023లో ర్యాంపేజ్‌’ అంటూ రాసుకొచ్చాడు. ఆ లెక్కన అయితే వచ్చే ఏడాది సుకుమార్‌ సినిమా ఉండాలి? మరి ఉందా లేదా అని విజయ్‌ మాత్రమే చెప్పగలడు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus