బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ వేడెక్కాయి. మొత్తం నలుగురు నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో మోనాల్, అఖిల్, అరియానా, అవినాష్ లు ఉన్నారు. అయితే, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి అవినాష్ కుటుంబసభ్యుల ఓటింగ్ తో ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. ఇది రెండు వారాల్లో ఎప్పుడైనా యూజ్ చేస్కోవచ్చని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడే సోషల్ మీడియాలో ఈవారం ఎవరు వెళ్లిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ ప్రకారం చూస్తే మోనాల్ అఖిల్ ఇద్దరూ కూాడ డేంజర్ జోన్ లో లేరు.
మోనాల్ కి హారిక ఫ్యాన్స్, అలాగే అభిజిత్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉండటంతో ఈవారం సేఫ్ జోన్ లోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక అఖిల్ కి కూడా తన ఫ్యాన్స్ , సోహైల్ మెహబూబ్ ఫ్యాన్స్ ఓట్లు వేసి రక్షిస్తున్నారు. అఖిల్ కూడా సేఫ్ గానే ఉన్నాడు. ఇక మిగిలింది అరియానా అంకా అవినాష్ లు మాత్రమే. అయితే, అవినాష్ ఎవిక్షన్ పాస్ వాడితే ఖచ్చితంగా సేఫ్ అవుతాడు. ఈ లెక్కలో చూస్తే అరియానా డేంజర్లో ఉంది. ఎలిమినేషన్ అయ్యే ప్రమాదంలో ఉంది.
మరి ఈవారం ఎలిమినేషన్ ప్రోసెస్ అనేది అసలు ఉంటుందా లేదా అనేది కూడా ఆసక్తికరం. ప్రజల ఓటింగ్ ప్రకారం చూస్తే అవినాష్ సేఫ్ అయితే అరియానా వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ ఎలిమినేషన్ అనేది ఎత్తేస్తే మాత్రం సేఫ్ అవుతుంది. నిజానికి ఇప్పుడున్న హౌస్ మేట్స్ లెక్క చూసినట్లయితే ఖచ్చితంగా ఒకవారం ఎలిమినేషన్ ని తీసేయాల్సి ఉంటుంది. లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కండీషన్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇక ఉండదనే అంటున్నారు అందరూ. కాబట్టి ఎలిమినేషన్ అనేది ఈవారం ఉంటుందా లేదా అనేది చాలా ఆసక్తికరం. ఇంకో విషయం ఏంటంటే, ఈవారం ఎలిమినేషన్ తీసేస్తే గనక అవినాష్ తన పాస్ ని తదుపరి వారం వాడుకోవచ్చు. అదీ మేటర్.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?