ఒక హీరోయిన్ కి ఎంత భీభత్సమైన స్టార్ డమ్, ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. సరైన సక్సెస్ లేకపోతే వేస్టే. పుష్కలంగా టాలెంట్ & యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవికి సరైన హిట్ లభించిన రెండేళ్లవుతోంది. 2017లో వచ్చిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” సాయిపల్లవికి దొరికిన లాస్ట్ కమర్షియల్ హిట్. ఆ తర్వాత నటించిన “కణం, పడి పడి లేచే మనసు, మారి 2, అతిరన్, ఎన్.జి.కె” వంటి సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. “ఎన్.జి.కె”లో సాయిపల్లవి నటన విషయంలో కూడా తొలిసారి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వినబడింది. అలాంటి తరుణంలో తన కెరీర్ కు “ఫిదా”తో బిగ్గెస్ట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల తాజా చిత్రంలో కథానాయిక అవకాశం లభించడంతో ఎగిరి గెంతేసింది సాయిపల్లవి.
నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మొదలైన ఆ చిత్రం నిజానికి డిసెంబర్ లో విడుదలవ్వాలి.. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. డిసెంబర్ లో విడుదల చేస్తామని ప్రకటించారు దర్శకనిర్మాతలు. దాంతో 2019లో మళ్ళీ హిట్ రుచి చూద్దామనుకొంది సాయిపల్లవి. కానీ ఆమె ఆశ మీద నీళ్ళు జల్లారు. నాగచైతన్య సినిమా డిసెంబర్ లో విడుదల చేయడం లేదని ఫిబ్రవరి లేదా మార్చి విడుదలకు ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు.
ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!