ఆఫర్లు లేక అలా కానిచ్చేస్తుంది…!

టాలివుడ్ లో హీరోయిన్ల పరిస్ధితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రతీ శుక్రవారం లెక్కలు మారిపోతూ ఉంటాయి. ఈరోజు క్రేజ్ లో ఉన్న హీరోయిన్లు రేపు ఏ పొజిషన్ లో ఉంటారో ఎవ్వరూ చెప్పలేరు. రెమ్యూనరేషన్ కు టెంప్ట్ అయ్యి గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తే..’ఆది’ లో ఎం ఎస్.గారు చెప్పినట్టు అస్సామే అని చెప్పాలి. హెబ్బా పటేల్ ను ఈ విషయంలో బెస్ట్ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు.

‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో వచ్చిన ప్రతీ సినిమా గుడ్డిగా ఒప్పేసుకుని చేసేసింది. అలా అని హిట్లు లేవా అంటే ఉన్నాయి.. ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ‘ఈడో రకం ఆడో రకం’ ‘నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్ ‘ వంటి హిట్లు ఉన్నాయి. కానీ ఆ చిత్రాల్లో ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండడు. దీంతో ఇప్పుడు ఈమెకు ఆఫర్లు రావడం లేదు.

దీంతో ’24 కిస్సెస్’ వంటి గ్లామర్ మూవీ చేసింది. అటు తరువాత ఓ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయ్యింది. ఇక మొన్నటికి మొన్న ‘భీష్మ’ చిత్రంలో క్లీవేజ్ షోతో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అయినా కలిసి రాలేదు. ఇక ఇప్పుడు ఐటెం సాంగ్ లో చేయడానికి కూడా రెడీ అయిపొయింది. ఇలా ఈమె ఆఫర్లు లేక ఇలాంటివి చేస్తూ.. ‘నేనున్నాను అంటూ’ దర్శక నిర్మాతలకు గుర్తుచేస్తుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus